సినిమా ఫ్లాప్ అయితే.. ఫ్యాన్స్ డల్ అయిపోతారు. కానీ.. విజయ్ దేవరకొండ రౌడీలు మాత్రం ఏమాత్రం డిప్రెస్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్లకు ఆనందం కలిగించే రెండు అంశాలున్నాయి. విజయ్ లాస్ట్ రెండు సిినిమాలు డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ ఫ్లాప్ అయినా.. ఫ్యాన్స్ ఏ మాత్రం ఫీల్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

 

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక గీత గోవిందం అయితే.. ఎవరూ ఊహించని విధంగా 70కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. యంగ్ హీరోలు చాలామంది ఉన్నా.. అందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. మధ్యలో నోటా ఫ్లాప్ అయినా.. టాక్సీవాలాతో కోలుకున్నాడు. అయితే.. ఆ తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్.. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్స్ అయ్యాయి. ఒక్కో సినిమా 10కోట్లు కూడా కలెక్ట్ చేయకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. 

 

రెండు డిజాస్టర్స్ వెనుకున్నా.. విజయ్ దేవరకొండకు లాభమే కానీ.. వచ్చిన నష్టమే లేదు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి పూరీ ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో విజయ్ ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. 

 

ఫైటర్ మూవీ నిర్మించడానికి ముందే విజయ్ కరణ్ జోహార్ కు పరిచయమయ్యాడు. డియర్ కామ్రేడ్ రిలీజ్ కాకుండానే హిందీ రీమేక్ రైట్స్ ను కరణ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పూరీతో కలిసి ఫైటర్ నిర్మిస్తున్నాడు. విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ నచ్చిందో.. యాక్టింగ్ నచ్చిందో గానీ.. హీరో కెరీర్ ను తన భుజాలపై వేసుకున్నాడు కరణ్. విజయ్ తో 100కోట్ల సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ భారీ ప్రాజెక్ట్ ను నిర్మిస్తాడో.. లేదంటే డైరెక్ట్ చేస్తాడో చూడాలి. కరణ్ ఆశీస్సులతో విజయ్ కెరీర్ బాలీవుడ్ లో సెటిలైపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: