యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన ఎస్ ఎస్ రాజమౌళి, తొలి సినిమాతో మంచి హిట్ కొట్టి దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక అక్కడి నుండి ఒక్కో సినిమాతో ఒక్కోమెట్టు ఎక్కుతూ దర్శకుడిగా తన సత్తాని అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగిన రాజమౌళి, ఇటీవల ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల అత్యద్భుత విజయాల తరువాత దర్శకుడిగా ఎన్నో గొప్ప శిఖరాలను అందుకున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల తో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ హిస్టారికల్ మూవీ ని తీస్తున్నారు రాజమౌళి. 

 

v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య తన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దాదాపుగా రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మాత్రమే కాక, హాలీవుడ్ సహా పలు ఇతర భాషలకు చెందిన దిగ్గజ నటులు కొందరు నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 2021 జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా ఎంతో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూపులు చూస్తున్న ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కు మరీ ముఖ్యంగా మెగా, నందమూరి అభిమానులకు ఈనెల 25 న రాజమౌళి అతి పెద్ద వీనుల విందుని అందించనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

 

ఆ రోజు తెలుగు సంవత్సరాది ఉగాది కావడంతో ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో పాటు సినిమా అధికారిక టైటిల్ ని కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. నిజానికి ఆ తరువాత మరొక రెండు రోజుల్లో, అనగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే ఉండడంతో ఒకరకంగా ఆ ఫస్ట్ లుక్ ఆయన ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అని అంటున్నారు. అలానే మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆయన ఫస్ట్ లుక్ తో పండుగ చేసుకుంటారని, ఈ విధంగా మార్చి 25న అతి పెద్ద పండుగ కోసం ఇరు హీరోల ఫ్యాన్స్ ని రాజమౌళి సిద్ధంగా ఉండమని సూచన ఇస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రానుందట.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: