రాజకీయాలలో అదేవిధంగా వ్యాపారంలో శాశ్విత మిత్రులు శాశ్విత శతృవులు ఉండరు అన్న విషయం ప్రస్తుతం రాజకీయాలలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కు బాగా అర్ధం అయినట్లు కనిపిస్తోంది. ‘అజ్ఞాతవాసి’ ఘోర పరాజయం తరువాత రాజకీయాల బాట పట్టిన పవన్ తిరిగి మళ్ళీ  సినిమాల్లోకి వస్తాడని ఎవరు అనుకోలేదు. 


అయితే పవన్ సినిమాల వైపు యూటర్న్ తీసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒకేసారి రెండు సినిమాలో నటిస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. ఇప్పటికే 3 సినిమాలను ప్రకటించిన పవన్ త్వరలోనే మరో 2 సినిమాలను లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు అంటూ వార్తలు గుప్పు మంటున్నాయి. దీనితో పవన్ నటించే సినిమాల సంఖ్య ఏకంగా 5కు చేరబోతోంది.


ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మూవీ కూడా చర్చల్లో ఉంది అని అంటున్నారు. వచ్చే ఏడాది చివరిలో ఈ మూవీ ప్రారంభం అవుతుంది అని తెలుఅస్తోంది.  అయితే ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకొ బోతోంది అని టాక్. 


‘అల వైకుంఠపురములో’ సినిమాను ఎలాగైతే హారిక హాసినితో కలిసి అల్లు అరవింద్ నిర్మించారో పవన్ మూవీని కూడ అదేవిధంగా నిర్మిస్తారని అంటున్నారు. వాస్తవానికి అల్లు అరవింద్ చిరంజీవి 150 సినిమా కానీ 151వ సినిమా కానీ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించాలని కలలు కన్నాడు. అయితే అరవింద్ కోరిక తీరకుండా చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చన సినిమాలు అన్నీ రామ్ చరణ్ తన సొంత బ్యానర్ పై నిర్మించాడు. ఈ విషయంలో అరవింద్ కు కొంత మనస్తాపం కలిగింది అన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. అయితే అరవింద్ తో గతంలో అనేక విషయాలలో విభేదించిన పవన్ ఇప్పుడు తన రీ ఎంట్రీ సినిమాల లిస్టులో అరవింద్ గీత ఆర్ట్స్ ను చేర్చడంతో పవన్ చాల తెలివైన రాజకీయ వేత్తగా మారిపోయాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: