సినిమా అనేది వ్యాపారమే. అందుకే కమర్షియల్ ఫార్ములాను దాటి ప్రయోగాల జోలికి వెళ్లేందుకు దర్శక నిర్మాతలు భయపడుతుంటారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అడపాదడపా మహిళా శక్తిని చాటే సినిమాలను తెరకెక్కిస్తూనే ఉన్నారు మన దర్శక నిర్మాతలు. అలా రూపొందిన సినిమాలో సంచనల విజయాలు, కాసుల పంట పండించిన సూపర్‌ హిట్‌లు కూడా చాలానే ఉన్నాయి.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా ఒసేయ్‌ రాములమ్మ. లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో దర్శక రత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలు అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమాజంలో మహిళ ఎదుర్కొంటున్న సమస్యలు ప్రశ్నించారు. అదే సమయంలో కమర్షియల్ అంశాలు కూడా మిస్‌ కాకపోవటంతో సినిమా ఘన విజయం సాధించింది.

 

ఈ ఫార్ములా ఇప్పుడే కాదు 70లలో కూడా బాగానే వర్క్‌ అవుట్ అయ్యింది. సంచలన దర్శకుడు కే బాలచందర్‌ తెరకెక్కించిన డిఫరెంట్ మూవీ అంతులేని కథ. జయప్రధ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించిటమే కాదు, ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. మహిళలు ఉద్యోగాలు చేయటం ప్రారంభించిన కొత్తలో సమాజంలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎవర్‌గ్రీన్‌ సక్సెస్‌ అనిపించుకుంది.

 

ఇదే ఇన్సిపిరేషన్‌తో ఆమె, కర్తవ్యం, మయూరి, ఇది కథకాదు, అశ్విని, అంకురం లాంటి సినిమాలు వచ్చాయి. అంతేకాదు పూర్తి కమర్షియల్ ఫార్మాట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. అనుష్క ప్రధాన పాత్రలో ఓ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన సినిమా అరుంధతి. సందేశాత్మకం కాకపోయినా మహిళ శక్తి తెర మీద ఆవిష్కరించటంలో అరుంధతి సక్సెస్‌ అయ్యిందనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: