ఎన్ని నీతులు చెప్పినా సినిమా అనేది పురుషాదిక్య రంగమే.అందుకే ఈ రంగంలో హీరోల స్థాయిలో పేమెంట్‌ అందుకేనే హీరోయిన్లు కనిపించరు. ఇతర సాంకేతిక రంగాల్లో అడపాదడపా తప్ప పెద్దగా మహిళ ప్రస్తావనే ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో సినీ రంగంలో మహిళలకు సరైన గౌరమే దక్కుతుందా. వెండితెర మీద అందాల ఒలకబోసే హీరోయిన్ల పరిస్థితి తెర వెనుక కూడా అంతే అందంగా ఉంటుందా..? 

 

పాతాకాలం సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కాస్త హుందాగా చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సినిమా పూర్తిగా కమర్షియల్‌గా మారుతుండటంతో హీరోయిన్లను అందాల ఆరబోతకే పరమితం చేస్తున్నారు. అంతేకాదు గతంలో ప్రేమ కోసం హీరోయిన్‌ వెంట హీరోలు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హీరోయిన్లే హీరోల వెంట పడుతున్నట్టుగా చూపిస్తున్నారు మేకర్స్‌.

 

హీరోయిన్స్‌ కూడా అవకాశాల కోసం వచ్చిన పాత్రలతోనే సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవకాశాలు దక్కటమే ఎక్కువ అన్న పరిస్థితి ఉండటంతో హీరోయిన్లు వచ్చిన పాత్రలకే ఓకె చెప్పేస్తున్నారు. తెర మీద మాత్రమే కాదు తెర వెనుక కూడా మహిళలకు ప్రాధాన్యత తక్కువే. మేల్‌ సింగర్స్‌ కు వచ్చిన స్థాయిలో ప్రాధాన్యత ఫీమేల్‌ సింగర్స్‌కు రావటం లేదు. దర్శకత్వ, సాంకేతిక రంగాల్లో మహిళ పేర్లు వినిపించటం చాలా అరుదు. అందుకే స్టార్‌ వారసులుగా హీరోలు టెక్నిషియన్స్‌ వస్తున్నా మహిళలు మాత్రం సినీ రంగంలోకి పెద్దగా రావటం లేదు.

 

ముఖ్యంగా టాప్‌ సినీ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేందుకు ఎవరు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించటం లేదు. మంచు లక్ష్మీ, మంజుల, నిహారిక లాంటి వారు ఇండస్ట్రీలోకి వచ్చిన వారు సక్సెస్‌ అయిన దాఖలాలు మాత్రం చాలా తక్కువే. అయితే పూర్తి పరిస్థితి అలాగే ఉందనటానికి కూడా లేదు. అడపాదడపా మహిళ శక్తిని చాటే సినిమాలు కూడా తెలుగు ఇండస్ట్రీలో వస్తున్నా.. సంఖ్యా పరంగా అవి చాలా తక్కువనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: