ఆహా డిజిటల్  ప్లాట్ ఫామ్ అల్లు అరవింద్ మొదలుపెట్టగానే అరవింద్ కు చెందిన గీతా 2 సంస్థ తన నిర్మాణా సంస్థ కార్యక్రామాల వేగం పెంచింది. ప్రస్తుతం వరస ఫెయిల్యూర్ లతో కొనసాగుతున్న  అఖిల్ తో సినిమా నిర్మిస్తూనే మరో వరస ఫెయిల్యూర్ హీరో కార్తికేయతో సినిమా మొదలు పెట్టింది. ఇది చాలదు అన్నట్లుగా నిఖిల్ తో కూడ మరో సినిమాకు లైన్ క్లియర్ చేసింది. 


లేటెస్ట్ గా నిన్న విడుదల ‘పలాస 1978’ దర్శకుడు కరుణ్ కుమార్ తో మరో సినిమాను చేయడానికి కధకు సంబంధించిన చర్చలు అరవింద్ చేస్తున్నాడు. ఇది చాలదు అన్నట్లుగా ఆహా లో కంటెంట్ పెంచడానికి అనేక యంగ్ డైరెక్టర్స్ చేత నూతన నటీనటులను పెట్టి వెబ్ సిరీస్ లను తీయిస్తున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో ఇన్ని సినిమాలు తీస్తున్న అరవింద్ ఏ ఒక్క సినిమాలోను అల్లు శిరీష్ తో చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి అఖిల్ నిఖిల్ కార్తికేయ లాంటి చిన్న హీరోలకు నప్పే విధంగా క్రియేట్ చేసిన కథలు కొద్దిగా మార్పులు చేస్తే ఆ శిరీష్ కు కూడ పనికి వస్తాయి. 


అయితే ఈ చిన్న విషయాలను కూడ పక్కకు పెట్టి సొంత నిర్మాణ సంస్థలో కూడ శిరీష్ కు ఎందుకు అవకాశాలు రావడం లేదు అన్న విషయం ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నగా మారింది. వాస్తవానికి శిరీష్ లుక్ పరంగా కానీ నటన పరంగా కాని తన మొదటి సినిమా కన్నా ఇప్పుడు బాగా మెరుగు పరుచుకున్నాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. అయితే ఈ విషయాలను కూడ అరవింద్ పట్టించుకాకపోవడం చూస్తుంటే శిరీష్ ను హీరోగా కాకుండా ‘ఆహా’ ను అమెజాన్ స్థాయిలో అభివృద్ధి పరిచి దాని నిర్వాహణా బాధ్యతలు శిరీష్ కు అప్పచెప్పే బాధ్యతలు అరవింద్ కు ఉన్నాయా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: