‘వరల్డ్ ఫేమస్ లవర్’ భయంకరమైన ఫ్లాప్ గా మారినా విజయ్ దేవరకొండ మ్యానియా ఏమాత్రం తగ్గలేదు అని చెప్పే ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. విజయ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సహా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 


ఈ మూవీతో విజయ్ బాలీవుడ్ ఎంట్రీ జరగబోతోంది. వాస్తవానికి బాలీవుడ్ ప్రేక్షకులు విజయ్ పై ఎటువంటి స్పందన తెలుపుతారు అన్న విషయమై ఇంకా క్లారిటీ లేకపోయినా కరణ్ జోహార్ విజయ్ కు ఆఫర్ చేసిన 100 కోట్ల డీల్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు కరణ్ జోహార్ విజయ్ దేవరకొండతో రానున్న మూడు సంవత్సరాలలో సంవత్సరానికి ఒక సినిమా చొప్పున వరసగా మూడు సినిమాలు తీసే ప్లాన్ లో ఉన్నాడట. 


ఈ ప్లాన్ కు విజయ్ అంగీకరిస్తే ఈ మూడు సినిమాలకు సంబంధించి అతడికి 100 కోట్ల పారితోషికం ఇచ్చే విధంగా ఎగ్రిమెంట్ చేసుకుందామని విజయ్ పై కరణ్ జోహార్ ఒత్తిడి చేస్తున్నట్లు టాక్. అయితే విజయ్ మాత్రం పూరితో తాను నటిస్తున్న మూవీ రిజల్ట్ వచ్చిన తరువాత ఈ ఎగ్రిమెంట్ విషయమై ఆలోచిద్దాం అని భావిస్తుంటే విజయ్ సన్నిహితులు మాత్రం ఈ 100 కోట్ల డీల్ కు వెంటనే ఒప్పుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 


వాస్తవానికి కరణ్ జోహార్ విజయ్ ‘డియర్ కామ్రేడ్’ మూవీని ఆ సినిమా విడుదల అవ్వకముందే హిందీలో రీమేక్ చేయాలని భారీ మొత్తానికి కొనుక్కున్నాడు. అయితే ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్ కావడంతో కరణ్ జోహార్ ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచన విరమించుకున్నాడు. దీనితో ఒకసారి విజయ్ తో నష్టపోయినా తిరిగి మళ్ళీ ఈ క్రేజీ హీరోకు ఇలా భారీ ఆఫర్లు ఇవ్వడం ఇప్పటికే బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసిన ప్రభాస్ అల్లు అర్జున్ చరణ్ లకు షాక్ ఇస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: