యువ హీరోలు వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలతో బిజీగా ఉన్నారు. కిరణ్ డైరక్షన్ లో వరుణ్ తేజ్ సినిమా తెరకెక్కుతుంది. మరోపక్క పూరి డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్ పూరి ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్నారు. అయితే వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ సినిమాలు రెండు ఒకేరకమైన కథలతో వస్తున్నాయని తెలుస్తుంది.

 

వరుణ్ తేజ్ సినిమాలో బాక్సర్ గా కనిపిస్తాడని తెలుస్తుండగా.. ఫైటర్ లో విజయ్ దేవరకొండ కూడా బాక్సింగ్ చేస్తాడని అంటున్నారు. ఈ ఇద్దరు హీరోల సినిమా కథలు ఒకేలా ఉండటంతో రెండు సినిమాల దర్శక నిర్మాతలు జాగ్రత్త వహిస్తున్నారు. అంతేకాదు సినిమా రిలీజ్ డేట్స్ కూడా క్లాష్ అయ్యేలా ఉన్నాయని తెలుస్తుంది. విజయ్, పూరి ఫైటర్ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఎనౌన్స్ చేయలేదు. కాని వరుణ్ తేజ్ సినిమా మాత్రం జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. అంతకుముందు ఆర్.ఆర్.ఆర్ కు ఈ డేట్ లాక్ చేయగా ఆ సినిమా వాయిదా పడటంతో వరుణ్ తేజ్ ఆ రోజు రిలీజ్ చేస్తున్నాడు. 

 

వరుణ్ తేజ్ కన్నా ముందే విజయ్ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. వరుణ్ తేజ్, విజయ్ ఇద్దరు ఒకే కథతో వస్తే ఏం జరుగుతుందో చూడాలి. విజయ్ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో విజయ్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న కసి మీద ఉన్నాడు. అయితే విజయ్ సినిమా కన్నా ముందే వరుణ్ తేజ్ సినిమా రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా ఆ మూవీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఈ రెండు సినిమాల కథలపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్న విషయాలపై చిత్రయూనిట్ స్పందించాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: