‘బాహుబలి’ తరువాత దక్షిణాది నుంచి పాన్ ఇండియా మూవీల హవా విపరీతంగా పెరిగిపోయిది. ‘బాహుబలి’ రికార్డులకు బ్రేక్ వేయాలని దక్షిణాదికి చెందిన ఎందరో టాప్ హీరోలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చిరంజీవి కూడ తన ‘సైరా’ తో ఈ ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు పెద్దగా కలిసి రావడంలేదు.    

 

ఇలాంటి పరిస్థితులలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మరక్కార్’ మూవీ మరో ‘బాహుబలి’ అవుతుందా అంటూ అప్పుడే అంచనాలు మొదలైపోయాయి. మోహన్‌ లాల్ ప్రధాన పాత్రలో మళయాళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో మార్చి 26న విడుదలవుతోంది. ‘అరేబియా సముద్ర సింహం’ అనేది ఈ చిత్ర టైటిల్‌కు ట్యాగ్ లైన్.  

 

ఈ నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ నిన్నటి నుంచి ప్రారంభించి నిన్న శుక్రవారం అన్ని భాషల్లోనూ ట్రైలర్‌ ను విడుదల చేశారు. తెలుగు ట్రైలర్‌ ను మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో భారీ  తారాగణం నటించడమే కాకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ మూవీని తీసారు. మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ యాక్షన్ కింగ్ అర్జున్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రభు మంజు వారియర్ సుహాసిని కీర్తి సురేష్ కళ్యాణి ప్రియదర్శన్ ఫాజిల్ సిద్ధిఖి ఇలా ఎందరో ప్రముఖ నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నారు.  

 


‘బాహుబలి’ కి పనిచేసిన సాబు సిరిల్ ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేయడం మరో విశేషం. 6వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని వారియర్ కుంజ‌లి మ‌ర‌క్కార్ జీవిత క‌థ ఆధారంగా భారీ బడ్జెట్ తో తీసారు. మరోసారి ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేయాలని జరుగుతున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి. అంతేకాదు చిరంజీవి ‘సైరా’ చేయలేని పనిని మోహన్ లాల్ ఎంతవరకు చేయగాలుగుతాడో ఈ నెలాఖరుకు తేలిపోతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: