డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ సుధాకొంగ‌ర ఎప్పుడూ ఓ డిఫ‌రెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ త‌న‌దంటూ ఓ ప్ర‌త్యేక ముద్ర‌ను కోలీవుడ్‌లో వేసుకుంది. ఇక ఈమె విక్టీరీ వెంక‌టేష్ హీరోగా న‌టించిన చిత్రం `గురు`తో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మ‌యింది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మూడు భాష‌ల్లోనూ ఈ చిత్రంబ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింద‌ని చెప్పాలి. లేడీ డైరెక్ట‌ర్లంటేనే చాలా త‌క్కువ అంచ‌నా వేసే ఇండ‌స్ట్రీలో ఈమె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల‌న్నీ కూడా దాదాపు సూప‌ర్‌డూప‌ర్ హిట్లు అయిన‌వే. త‌ను ఎంచుకునే క‌థ‌లు చాలా భిన్నంగా ఉంటాయి. లైఫ్‌లో చాలా మందికి చాలా ఛాయిసెస్ ఉంటాయి. అందులో కొంత మంది ఈజీ వేని ఎంచుకుంటారు. మ‌రికొంద‌రు ట‌ఫ్ పార్ట్‌ని ఎంచుకుంటారు. త‌ను ఓసారి త‌న గురించి చెప్పిన ఓ మీడియా ఇంట‌ర్వ్యూలో ఈ విధంగా స్పందించింది. నేను ఎప్పుడూ కూడా ట‌ఫ్ పార్ట్‌నే ఎంచుకుంటూ ఉన్నాను. సినిమా అనేది ఈజీ కాదు చాలా క‌ష్ట‌మైన ప‌ని. అందులోనూ ఒక ఆడ‌పిల్ల ఈ రంగంలో రాణించ‌డం ఇంకా క‌ష్టం.

 

ఈ విశ్వంలోనే ఎంతో క‌ష్ట‌మైన ప‌ని ఏమిటి అంటే అది ఒక సినిమాని డైరెక్ట్ చేయ‌డం అని ఆమె అన్నారు. ఒక్కోసారి న‌న్ను నేనే అద్దం చూసుకుని అనుకునేదాన్ని ఇదంతా నాకు అవ‌స‌ర‌మా అని. మొద‌ట్లో నేను అలా బాద‌ప‌డ్డా కూడా ప్ర‌స్తుతం చాలా ఆనంద‌ప‌డ్డాను. నా జ‌ర్నీ అంతా ఏదో కొన్ని రోజులు కుంటుకుంటూ న‌డిచినా..కొన్ని రోజులు ప‌రిగెత్తినా కూడా నేను అనుకున్న గ‌మ్యానికి చేరినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నా జీవితంలో ఉన్న చాలా ఫ్ర‌స్టేష‌న్స్, క‌ష్టాలు, ఛాలెంజెస్ అలాంటివ‌న్నీ కూడా ఈ గురు చిత్రంలో చూపించాను. న‌న్ను ఇంత ఇదిగా ఆద‌రించినందుకు ప్ర‌తి ఒక్క‌రికి పేరు పేరున నా కృతజ్ఞ‌త‌లు. 

 

ఇక తెలుగులో కూడా ఈ చిత్రానికి ఇంత పెద్ద భ్ర‌మ‌ర‌ధం ప‌ట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. భాష ఏదైనా భావం అర్ధ‌మ‌యితే అని జ‌నాల‌కి న‌చ్చితే త‌ప్ప‌కుండా వాళ్ళ టాలెంట్‌ని గుర్తిస్తార‌ని అని ఆమె అన్నారు. ప్ర‌స్తుతం ఈమె  సెల్వరాఘవన్‌కి తెలుగులో శ్రీరాఘవగా కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. బాలీవుడ్ మూవీ `సాలాఖద్దూస్‌`, తెలుగులో గురు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వంలో సూర్య ఓ విభిన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో విలన్‌ పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండటంతో దానిని మోహన్‌బాబుని చేయమని స్వయంగా సూర్య కోరాడని, దానికి మోహన్‌బాబు కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: