పవన్ కళ్యాణ్ అండ్ శృతి హాసన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మన కమల్ హాసన్ వారసురాలిగా 2009లో బాలీవుడ్ మూవీ 'లక్' ద్వారా హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ ఆమె లక్ కలిసిరాలేదు. ఆ సినిమా పెద్ద ప్లాప్ తరువాత 2011లో తెలుగులో 'అనగనగా ఓ ధీరుడు' అనే మరో సినిమా చేసింది. కానీ ఆ సినిమా కూడా భారీ డిజాస్టర్. తదుపరి తమిళంలో 'సెవెన్త్ సెన్స్' సినిమా చేసింది అది కూడా అట్టర్ ప్లాప్. ఇక దాంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే నామకరణం పడిపోయింది పాపం. 

 

IHG

 

తర్వాత సరిగ్గా 11 మే, 2012 లో పవన్ అండ్ శృతి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తరువాత శృతి ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఇక అప్పటికే పలు ప్లాపులు చుసిన పవన్ కళ్యాణ్ కు కూడా ఆ సినిమా ప్లాపుల నుండి ఊరటనిచ్చింది. ఇక ఆ సినిమా నుండి శృతి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తరువాత ఆమె వరుసగా      తెలుగు, తమిళంలో చాలా బిజీ అయిపోయారు.

 

అక్కడినుండి సౌత్ లో సూపర్ స్టార్ హీరోయిన్ల జాబితాలో శృతి హాసన్ చెటు సంపాదించుకోవడం విశేషం. ఈ విషయమై శృతి హాసన్, తనకు సందర్భం వచ్చినప్పుడల్లా మీట్స్ లో స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ గారితో చేసిన 'గబ్బర్‌సింగ్‌' తర్వాతనే నా కెరీర్‌కు ఊపొచ్చింది.. అని అమ్మడు చెప్పడం మనం ఎన్నో సార్లు చూసాం. తరువాత అతని కాంబినేషన్ లో శృతి చేసిన 'కాటమరాయుడు' సినిమా కూడా పర్వాలేదని అనిపించింది.

 

IHG

 

మొత్తానికి ఒకరకంగా పవన్ అండ్ శృతి జంట కలిస్తే, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమనే ఒక విషయం తేట తెల్లమైంది. ఇటు అభిమానులు కూడా వారి కలయికను కోరుకునేవారే. మరి వారి మనోభీష్టం ఇపుడు సిద్ధిస్తుందని చెప్పి తీరాలి మరి... వారు ఇరువురూ ఇపుడు ముచ్చటగా మూడవ సారి జోడి కట్టబోతున్నారు. మరలా బొమ్మ హిట్ కాబోతుందన్నమాట..!

మరింత సమాచారం తెలుసుకోండి: