యాంకర్ గా బుల్లితెర మీద సందడి చేస్తున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా చేస్తున్న సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా నుండి వచ్చిన నీలి నీలి ఆకాశం సాంగ్ సూపర్ హిట్ అవడంతో ఆ ఒక్క సాంగ్ తో సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  ఆ సాంగ్ తో సినిమాకు బజ్ కూడా ఏర్పడడంతో సినిమా మీద అంచనాలు పెరిగాయి.

 

ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా వెనుక రెండు బడా నిర్మాణ సంస్థలు ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య చిన్న సినిమాలకు పెద్ద బ్యానర్ ల అండ ఉంటున్న వవిషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రదీప్ మాచిరాజు సినిమాకు గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ ఇద్దరు కలిసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ప్రదీప్ సినిమాను ఈ రెండు రిలీజ్ చేయడంపై ఆడియెన్స్ లో కూడా సినిమాపై ఆసక్తి పెరిగింది.

 

ప్రదీప్ సరసన అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. మున్నా డైరెక్ట్ చేసిన ఈ సినిమా విషయంలో ప్రదీప్ తీసుకుంటున్న ప్రతి డెసిషన్ సినిమాకు హైప్ తెస్తుంది. తన కామెడీ స్కిట్స్ తో అలరించిన సుడిగాలి సుదీర్ హీరోగా చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ప్రదీప్ మాత్రం అలాంటి తప్పులు జరుగకుండా జాగ్రత్తపడుతున్నాడు. కచ్చితంగా ప్రదీప్ ఈ సినిమాతో తన మార్క్ చూపించేలా ఉన్నాడు. సాంగ్స్ తో సినిమాకు మంచి రెస్పాన్స్ తెచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రదీప్ మొదటి అటెంప్ట్ సక్సెస్ అయితే మాత్రం అతను హీరోగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. స్మాల్ స్క్రీన్ పై సక్సెస్ అయిన ప్రదీప్ సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతాదా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: