షాకింగ్ గా వున్నా, ఇది నిజమే. కన్నడ పిరియాడికల్ యాక్షన్ డ్రామా  కెజిఎఫ్ చాప్టర్ 2 , మరియు రాజమౌళి ఎపిక్ క్లాసిక్ పిరియాడికల్ సినిమా 'ఆర్ఆఆర్' బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డ‌నున్న‌ట్టు కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో చాలా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 8న విడుద‌ల కానుంద‌ని ఇప్ప‌టికే సదరు చిత్ర బృందం ప్ర‌క‌టించ‌గా, కేజీఎఫ్ 2 సంక్రాంతికి రిలీజ్ అవుతుంద‌ని శాండిల్ వుడ్ ఫిలిం నగరం సమాచారం.

 

IHG

 

ఈ పరిస్థితులలో రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ప‌డితే థియేట‌ర్ల‌తో పాటు క‌లెక్ష‌న్స్ విష‌యంలో చాలా తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కేజీఎఫ్ 2 చిత్ర హీరో య‌శ్ తాజాగా ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు పోటీ ప‌డే అవ‌కాశం లేద‌ని ఖరాకండిగా చెప్పారు. ఇంకా అయన మాట్లాడుతూ... రాజమౌళితో పోటీ ఏంటండీ! అని సదరు విలేఖరి దగ్గర నవ్వేశారట.

 

IHG

 

అయితే అక్కడే వచ్చింది అసలు చిక్కు. యష్ లౌక్యాన్ని మన టాలీవుడ్ మెచ్చుకున్నా.. అతని మీద కన్నిడుగులు మాత్రం చాలా గుర్రుగా వున్నారని టాక్. అయితే ఇప్పటికే ఇరువైపులా నిర్మాత‌లు రిలీజ్ డేట్ విష‌యంలో చ‌ర్చ‌లు జరిపారని వినికిడి. మ‌రోవైపు ప్రముఖ బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని ఆర్ఆర్ఆర్ అండ్ కెజిఎఫ్ 2 యొక్క హిందీ వెర్షన్లను పంపిణీ చేస్తున్న విషయం కూడా తెలిసినదే. 

 

IHG

 

అందువల్ల రెండు సినిమాల మధ్య  పోటీ నెల‌కొనే పరిస్థితి రాబోదని యష్ ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. య‌ష్ మాట‌ల‌తో అభిమానుల‌లో ఓ క్లారిటీ అయితే వ‌చ్చింద‌ని, ఎటొచ్చి.. సదరు యష్ నిర్మాతలు మాత్రం తన మీద అలిగినట్లు బోగట్టా. ఇందులో వాస్తవమెంతో తెలీదు గాని, ఇక లోగుట్టు పెరుమాళ్ళకెరుక..! ఇక ఇటీవల యష్ సూపర్ మోడల్ అవార్డు అందుకున్న విషయం అందరికి విదితమే.

మరింత సమాచారం తెలుసుకోండి: