దేశంలో నిజానికి ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందనే చెప్పవచ్చు. కానీ క్యాస్టింగ్ కౌచ్ ఉదతంపై ఎంత మంది ఎన్ని చెప్పినా, నిరసలు జరిగినప్పటికీ కూడా ఎవరో ఒకరు ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా డాన్స్ మాస్టర్ లారెన్స్ తమ్ముడు ఎల్విన్ అలియాస్ వినోద్ (విన్నీ) తనను వేధిస్తున్నాడంటూ టాలీవుడ్ సైడ్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ అయిన దివ్య (19) ఒక ప్రముఖ టీవీ ఛానల్‌ ని ఆశ్రయించింది. అందులో లారెన్స్ తమ్ముడు తనను మోసం చేశాడని వేధింపులకు కూడా గురిచేస్తున్నాడంటూ షాకింగ్ విషయాలని ఆమె బయటపెట్టింది.

 

IHG

 విన్నీ తన ప్రేమను తిరస్కరించినందుకు తనను వేధింపులకు గురిచేశాడంటూ వరంగల్‌ నగరానికి చెందిన దివ్య అనే యువతి ఇప్పుడు మీడియాకెక్కడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాంటివి తట్టుకోలేక హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, అక్కడ పని చేస్తున్న సీఐతో వారు కుమ్మక్కై తనపై తప్పుడు కేసు బనాయించి జైలుకు కూడా పంపారని చెబుతుంది సదరు యువతి. 

 

IHG


ఇంత జరిగినా జైలు నుండి విడుదలైన తరువాత కూడా వేధింపులు కొనసాగుతున్నాయని తనపై లారెన్స్ తమ్ముడు వినోద్, అతని సహచరులు ఎక్కడికి వెళ్లినా తనను వెంటపడుతూ తనను చంపటానికి కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది ఆ యువతి. ఇప్పుడు ఆమె ఏకంగా ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ని కల్పించుకుని తనకు రక్షణ కల్పించాలని కోరుతోంది దివ్య.

 

IHG

అసలు దివ్య ఏం చెబుతందంటే... తనపై కక్షసాధింపు చర్యల్లో పోలీసులు లారెన్స్ తమ్ముడైన విన్నీతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తోంది. అక్కడ పని చేస్తున్న ఏసీపీ రవీందర్ రెడ్డి తనపై బ్రోతల్ కేసు పెట్టి 21 రోజులు జైలుకు పంపారని, అక్కడ విచారణ పేరుతో లాడ్జిలకు రమ్మని వారు నీచంగా మాట్లాడేవారంటూ కన్నీటీ పర్యంతమైంది ఆ సదరు మహిళ. 

మరింత సమాచారం తెలుసుకోండి: