సెలబ్రెటీల విషయంలో సోషల్ మీడియాలో చిన్న విషయం భూతద్దంలో చూస్తుంటారు.  తాాజాగా తెలుగు బుల్లితెరపై మెయిల్ యాంకర్ గా సత్తా చాటుతున్న ప్రదీప్ మాచిరాజు ప్రస్తుతం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే చిత్రంతో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే గత కొంత కాలంగా  ప్రదీప్ మాచిరాజు గురించి రోజుకో వార్త చక్కర్లు కొడుతోంది.  తాజాగా  ప్రదీప్ ఓ నటితో చాలా రోజులు ప్రేమలో ఉన్నాడన్న పుకార్లు వస్తున్నాయి. అలాగే, కొంతకాలం క్రితం ప్రదీప్ చేసిన ‘పెళ్లి చూపులు’అనే షోలో పాల్గొని విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరితో అతను డేటింగ్ చేశాడని దర్శకుడు శ్రీరామోజు సునిశిత్ కామెంట్ చేశాడు. గతేడాది ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ అనే ప్రోగ్రామ్‌ కూడా చేసిన సంగతి తెలిసిందే.

 

ఇందులో జ్ఞానేశ్వరి అనే నటి విజేతగా నిలిచింది. అప్పట్లో వీరి పెళ్లి అయ్యింది అన్న వార్తలు వచ్చాయి.. కానీ అది కేవలం ఓ ఎంట్రటైన్ మెంట్ ప్రోగ్రామ్ అని క్లారిటీ ఇచ్చారు.  తాజాగా ఈ విషయంపై  జ్ఞానేశ్వరి స్పందించారు.  నాకు అసలు సినిమాలు, టీవీ షోలపై అస్సలు ఐడియా లేదు. జీవితంలో ఏం చేసైనా ఎంట్రప్రెన్యూర్ అవ్వాలన్నది నా ఆశ.  ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్న తాను.. కొలీగ్  తీసిన షార్ట్ ఫిలింలో సరదాగా నటించానని తెలిపింది.

 

అదే క్రమంలో పెళ్లి చూపులు షోలో కూడా పాల్గొన్నానని చెప్పింది. ఈ కార్యక్రమం పబ్లిక్ మొత్తం చూశారు.   ప్రదీప్ సౌతిండియాలోనే మోస్ట్ పాపులర్.   ఆయన ఏం చేసినా వైరలే. అందుకే నేను, ఆయన డేటింగ్‌లో ఉన్నామని కామెంట్స్ చేస్తున్నారు.  కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అన్నీ 99 శాతం అబద్ధమే ఉంటాయి. అందుకే నేను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని జ్ఞానేశ్వరి క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఈ రూమర్లకు చెక్ పెట్టినట్టయ్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: