భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  ఈ మద్య కొంత మంది భార్యా భర్తలు చిన్న చిన్న విషయాలకు గొడవ పడుతూ.. విడాకుల దాకా వెళ్లడం చూస్తున్నాం. తాజాగా భర్త కొడితే వెంటనే విడాకులు ఇచ్చేయాలా తిరిగి కొట్టలేరా అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్. అసలు విషయానికి వస్తే.. బాలీవుడ్ తాప్సీ పొన్ను హీరోయిన్ గా నటించిన సినిమా ‘థప్పడ్’...  ఈ మద్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు.  ఈ చిత్రంలో తాప్సీ ఓ గృహిణిగా నటించింది. ఇల్లే స్వర్గం.. తన భర్తే దేవుడు అనుకొని జీవించే సగటు మహిళగా నటించింది.  అయితే ఆమె భర్త అనుకోకుండా ఆమె చెంపపై కొడతాడు.. దాంతో ఆమె మనోభావాలు దెబ్బతిని విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కేవలం ఒకే ఒక్క చెంప దెబ్బ వల్ల విడాకులు తీసుకోవాలని అనుకుంటున్న తాప్సి నిర్ణయానికి న్యాయస్థానం కూడా షాక్ అవుతుంది.ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ. ఇది డొమెస్టిక్ వైలెన్స్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రం.

 

అయితే ఈ చిత్రంపై ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో వివాహ బంధానికి ఒక అర్థం ఉంది.  భార్యాభర్తల్లో గొడవలు రావడం సహజం.. భర్త ఒక్క చెంప దెబ్బ కొట్టగానే భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం అనే కాన్సెప్ట్ నాకు అస్సలు అర్థం కాలేదు. భర్తతో సమస్య వచ్చినపుడు ఒకవేళ ఆమెపై చేయి చేసుకున్నపుడు ఒకవేళ నేను నా భార్యను కొడితే ఆమె నన్ను కూడా కొట్టి గొడవను అక్కడితో ఆపొచ్చు.

 

మరీ గొడవ పెద్దదై నాకు నీతో జీవించాలని లేదు అని చెబితే భార్య కూడా ఆ మాట చెప్పొచ్చు.. కానీ ఒక్క చెంప దెబ్బ భార్యాభర్త కలిసి ఉండాలా లేదా అన్నది నిర్ణయించలేదు కదా అన్నారు. అయితే ఈ విషయంలో ఎవరి అభిప్రాయం వారిది ని అనడం కొసమెరుపు.  అయితే ఈ విషయం నటి తాప్సీ ముందు ప్రస్తావిస్తే.. అహ్మద్ ఖాన్ ఈ విషయంలో తనకు నచ్చిన పద్దతిలో ఉండొచ్చు.. కానీ చిత్రాలు ఏవైనా చివరికి జడ్జీమెంట్ ఇచ్చేది ప్రేక్షకులు మాత్రమే.  ఒకవేళ ఆయన ఆలోచన పద్దతుల్లో చిత్రాలు తీస్తే అది ఆయన ఇష్టం అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: