డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా తెరకెక్కించి హిట్టు సాధించిన తర్వాత మళ్ళీ సరైన హిట్ కొట్టలేక సతమతమయ్యాడు. అదృష్టవశాత్తు ఎట్టకేలకు రామ్ పోతినేని తో పచ్చి మాస్ మసాలా సినిమా 'ఇస్మార్ట్ శంకర్' ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్టు ని అందుకున్నాడు. మళ్లీ ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ లో కొండంత ధైర్యం నిండిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం ఫామ్ లో పూరి జగన్నాథ్ బాక్సింగ్ డ్రామా 'ఫైటర్' సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కాగా... హీరోయిన్ బాలీవుడ్ నటి అయిన అనన్య పాండే. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరోయిన్ రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ కీలకమైన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 

 

IHG


వాస్తవానికి ఈ సినిమా పాన్ ఇండియన్ మూవీ కాకపోయినా ఇందులో నటించే నటీనటులు నేషనల్, ఇంటర్నేషనల్ ప్రముఖులు కావడం గమనార్హం. పూరి జగన్నాథ్ సినిమా స్టార్ట్ చేసిన కొత్తలో మైక్ టైసన్ పేరు బాగా వినిపించింది. ఆ ఇంటర్నేషనల్ బాక్సర్ ని ఎలాగోలా ఒప్పించి తన సినిమాలో నటింపజేయాలని పూరి జగన్నాథ్ సవాలక్ష ప్రయత్నాలు చేశాడు కానీ అతనిని ఒప్పించడం అసాధ్యమని తాజాగా తెలుసుకున్నాడు. అందుకే మరొక ఇంటర్నేషనల్ బాక్సర్ ని సంప్రదించాలని ఆ సినీ బృందం సన్నాహాలు చేస్తుందట. 

 

IHG

 

ఈ సినిమాని ఛార్మి కౌర్, పూరి తో పాటు కరణ్ జోహార్ కూడా నిర్మిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఐతే కరణ్ జోహార్ కు ప్రముఖులతో కాస్త ఎక్కువగా పరిచయం ఉంది కాబట్టి తానే స్వయంగా మరొక ఇంటర్నేషనల్ బాక్సర్ ని కలుసుకోగలిగాడట. ప్రస్తుతం ఆ ఇంటర్నేషనల్ బాక్సర్ తో కరణ్ జోహార్ చర్చలు జరుపుతున్నాడు. ఒకవేళ ఆ ఇంటర్నేషనల్ బాక్సర్ ఫైటర్ చిత్రానికి ఓకే చెబితే అతని పేరును అఫీషియల్ గా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: