దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్పీఆర్ విషయంలో ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే.  కేంద్ర ప్రభుత్వంపై ఇప్పటికే పలువురు పార్టీ నేతలు.. ప్రజలు ఈ విషయంపై ధ్వజమెత్తుతున్నారు.  అంతే కాదు కొంత కాలంగా దీనిపై పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతున్నాయి.  ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.  సీఏఏ, ఎన్పీఆర్  మన రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లోనూ ఉందని అన్నారు.  తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, సీఏఏ, ఎన్పీఆర్ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   నేను ఊరిలో సొంత ఇంటిలో పుట్టా. నాకు ఎలాంటి బర్త్ సర్టిఫికెట్ లేదు. మరి నేను ఎలా నిరూపించుకోవాలి? ఆ కాలంలో పూజారిని పిలిచి జన్మ నామం లేదా జన్మ పత్రిక అని రాయించే సాంప్రదాయం ఉండేది.

 

ఇప్పటికీ నా దగ్గర అదే ఉంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లి సర్టిఫికెట్స్ తీసుకు రావాలి? అంటూ ప్రశ్నించారు.  నేను ఊరిలోనే పుట్టాను..  ఆ రోజున ఆసుపత్రులు, ఈ రికార్డులు లేవు. నాదే దిక్కులేదంటే, ‘మీ నాయనది తీసుకురమ్మంటే’ నేను చావాలనా? మాకు 580 ఎకరాల జాగా, పెద్ద బిల్డింగ్ ఉంది. అలాంటి కుటుంబంలో పుట్టిన నాకే బర్త్ సర్టిఫికెట్ లేకపోతే దళితులకు, నిరుపేద ప్రజలకు ఎక్కడిది? వివరాలు తెమ్మంటే యాడ తేవాలి?’ అని ప్రశ్నించారు.  

 

ఎన్‌పీఆర్ అనే ఇంత పెద్ద తతంగం ఎందుకసలు? దాని బదులు ఏవైనా గుర్తింపు కార్డులు పెట్టండి. ఇందులోనూ ప్రాథమిక లోపం ఏంటంటే.. సీఏఏ చట్టం స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ సీఏఏను ఏ దేశమూ అంగీకరించబోదు అన్నారు.   ఈ సీఏఏ గురించి సవివరంగా మనం చర్చించుకుందాం. ఇందులో విపక్షాలు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా మాట్లాడతారు. అన్ని చర్చించుకొని తీర్మానం ఆమోదించుకుందాం  అని కేసీఆర్ ప్రసంగించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: