టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతం అయిన పూరికి ఇటీవల రామ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ కొట్టి, మంచి బ్రేక్ ని ఇచ్చింది. తొలి సినిమా బద్రి నుండి మొన్నటి ఇస్మార్ట్ వరకు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే పూరి టేకింగ్ లో  కానీ, ఆయన మార్క్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ లో మాత్రం మార్పు రాలేదు. ఇక ఆయన సినిమాల్లో హీరోలు ఎక్కువగా ఎవరినీ లెక్కచేయకపోవడంతో పాటు మంచి ఎనర్జితో ఉండడం చాలా సినిమాల్లో గమనించవచ్చు. 

 

ఇక తన కెరీర్ లో తొలి సినిమా బద్రి తరువాత పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, శివమణి వంటి మంచి సక్సెస్ఫుల్ సినిమాలతో పాటు ఎన్నో ఫ్లాప్స్ కూడా చూసిన పూరి, ఇండస్ట్రీ లో జయాపజయాలు కామన్ అని, అయితే అపజయం వచ్చినప్పుడు మాత్రం మనల్ని మనం కనుక మెంటల్ గా బ్యాలెన్స్ చేసుకోగలిగితే తప్పకుండా మంచి రోజులు వస్తాయని అంటుంటారు. ఇక పూరి తీసే సినిమాల్లోని హీరోలకు సిగరెట్ తాగే అలవాటు చాలావరకు కామన్ గా ఉండడం, అలానే ఆ సినిమాల్లోని కొందరు హీరోలు ఎంతో స్టైలిష్ గా సిగరెట్ తాగడం గమనించవచ్చు. 

 

ఇక ఆ విధంగా ప్రస్తుతం విజయ్ తో తీస్తున్న సినిమాలో కూడా హీరోకు సిగరెట్ వంటి ఇతర అలవాట్లు ఉంటాయా అని కొందరు ఇప్పటి నుండే చర్చించుకుంటున్నారు. ఇక నేడు ఆ సినిమా సెట్స్ లో పూరి ఏదో ఒక సీన్ కోసం తీక్షణంగా ఆలోచిస్తూ సిగరెట్ తాగుతున్న స్టిల్స్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అయితే దమ్మేసేది నువ్వేనా లేక సినిమాలో నీ హీరో కూడానా పూరి, అంటూ కొందరు నెటిజన్లు ఆయన ఫోటోలపై సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: