టాలీవుడ్ లో కామెడియన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన బండ్ల గణేష్ తర్వాత స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు.  ఆయన మొదట బుల్లితెరపై నటించాడు. తర్వాత వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ.. మంచి కమెడియన్ గా ఎదిగారు.  నిర్మాతగా మారిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు.  ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.  గత ఏడాది తెలంగాణలోఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఆ పార్టీ దారుణంగా ఓడిపోవడంతో తనకు రాజకీయాల సరిపడవని నిర్ణయం తీసుకొని పార్టీకి గుడ్ బాయ్ చెప్పారు. 

 

అయితే మళ్లీ వెండి తెరపై అడుగు పెట్టారు. ఈ ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు లోతనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. అయితే బండ్ల గణేష్ కి పౌల్ట్రీ పరిశ్రమ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఎఫెక్ట్ బండ్ల గణేష్ పై పడిందని అంటున్నారు. కొంత కాలంగా  కరోనా వైరస్ రూమర్స్ తో రోజురోజుకు చికెన్ ధరలు పడిపోతున్నాయి. గత ఇరవై రోజుల నుంచి అమాంతం తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నేపధ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ భవిష్యత్‌ అగమ్యగోచరంగా తయారైంది.

 

సరిగ్గా నెల రోజుల క్రితం కిలో చికెన్  రెండు వందలకు పైగా ఉన్న రేటు అనూహ్యంగా తగ్గుముఖం పట్టింది.  తెలంగాణలో గుడ్ల ధరను నిర్ణయించే అతికొద్ది మంది బిజినెస్ మెన్స్‌లో బండ్ల గణేష్ కూడా ఒకరు.  కరోనా దెబ్బకు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. మరోవైపు చికెన్ తింటే వైరస్ సోకుతుందనే వదంతులు నమ్మవద్దని డాక్టర్లు చెబుతున్నా ఎవరూ వినటం లేదు.  ఏది ఏమైనా వైరస్‌ దెబ్బ ఫౌల్ట్రీ రంగానికి, దాన్ని నమ్ముకున్న బండ్ల గణేష్ లాంటి వారికి గట్టిగానే  ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: