టాలీవుడ్ లో అఖిల్ అక్కినేని సినిమా వస్తుంది అంటే క్రేజ్ ఉండటం లేదు అంటున్నారు టాలీవుడ్ జనం. దీనికి కారణం ఏంటో తెలియదు గాని అతని మీద ఎవరికి ఆసక్తి లేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తుంటే అతను మాత్రం ఇబ్బంది పడుతున్నాడని అంటున్నారు. అసలు దీనికి కారణం ఏంటో తెలియదు గాని అతను ఒక్క హిట్ కొడితే చాలు అనుకుని ఆశగా ఎదురు చూస్తున్నారు అక్కినేని అభిమానులు. 

 

అతని సినిమా వస్తుంది అంటే చాలు జనాలు లెక్కలు వేయడం మానేసి ఈ సినిమా అయినా సరే హిట్ అయితే బాగుండు అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అతను నటించిన ఏ సినిమా కూడా సరైన హిట్ కొట్టలేదు. దీనితో జనం ఇప్పుడు పూజలు కూడా చేయడం మొదలుపెట్టారు. సాధారణంగా ఫ్యామిలీ అభిమానులు అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు వచ్చినా సరే ఒక రకమైన ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. కాని అఖిల్ సినిమా వస్తుంది అంటే భయం తో ఎదురు చూసే పరిస్థితి. 

 

సోషల్ మీడియాలో అయితే అయ్యగారి సినిమా వస్తుంది అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని అభిమానులే. ఇప్పుడు ఒక సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా పూజ హెగ్డే నటిస్తుంది. సినిమాకు దర్శకుడు కూడా కాస్త పేరున్న దర్శకుడే. దీనితో ఈ సినిమా విజయం సాధించాలి అని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే అతని కెరీర్ కచ్చితంగా గాడిలో పడుతుంది అని అప్పుడు కాస్త స్వేచ్చగా సినిమాలు చేయడం ఖాయమని అంటున్నారు. మరి ఏ విధంగా అతను హిట్ కొడతాడో అతని కెరీర్ ఏ విధంగా మలుపు తిరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: