టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ఎదో ఒక విషయంపై తనదైన స్టైల్లో సెటైర్లు వేస్తుంటారు. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన ఎవ్వరినీ వదలరు.  ముఖ్యంగా సినీ సెలబ్రెటీల గురించి ఆయన వేసే పంచ్ లు మాములుగా ఉండవు.  ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి సెలబ్రెటీలు రక రకాలుగా స్పందిస్తున్నారు.  కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన దరికి చేరదని భారత దేశంలో కరోనాతో ఎవరు మరణించలేదని.. సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారని ఎవ్వరూ భయపడకండి అంటూ సోషల్ మాద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. మరికొంత మంది కరోనాకు చిట్కాలు సూచిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

 

అయితే ఎప్పుడూ సిజనల్ విషయాలపై వెంటనే స్పందించే రాంగోపాల్ వర్మ అప్పుడే కరోనాపై తనదైన పంచ్ వేశాడు.  ప్రియమైన వైరస్, బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూపోయే బదులుగా మీరు కూడా మాతో పాటు చనిపోతారని తెలుసుకో. ఎందుకంటే నువ్వు కూడా ఓ పారసైట్‌వే(పరాన్నజీవి). నామాటలపై నమ్మకం లేకపోతే వైరాలజీలో క్రాష్ కోర్స్ తీసుకో. కాబట్టి నా అభ్యర్థన ఏమిటంటే నువ్వు జీవించు, మమ్మల్ని జీవించనివ్వు. జ్ఞానం ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నా? అంటూ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై నెటిజన్లు సైతం రక రకాలుగా కామెంట్స్ చేస్తూ వచ్చారు.

 

తాజాగా మరోసారి సూపర్ హీరోస్ పై సెటైర్లు వేశారు.  విలన్ లా భయపెడుతున్న కరోనా ని ఎదుర్కోవాల్సిన హీరోలంతా ఎక్కడికి వెళ్లారు. స్పైడర్ మ్యాన్ - సూపర్  మ్యాన్ - బ్యాట్ మ్యాన్ వంటి హీరోలు ఎక్కడ ఉన్నారు. వేరే గ్రహానికి వెళ్లారని మాత్రం చెప్పకండి అంటూ పంచ్ వేశాడు.  అయితే రాంగోపాల్ వర్మ వేసిన సెటైర్ పై మళ్లీ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  ప్రస్తుతం కరోనా భయంతో జనాలు హడలి పోతుంటే.. ఇప్పుడు నీకు పంచ్ లు అవసరమా అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: