గత ఏడాది దిశ ఘటన యావత్ భారతదేశం మొత్తం మీద ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఆ దారుణ ఉదంతానికి కారణమైన నలుగురు నిందితులు పోలీసు ఎన్ కౌంటర్ కు గురైన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటన జరిగిన కొన్నాళ్లకు వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నలుగురు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య రేణుకను పరామర్శించి ఆమెను ఇంటర్వ్యూ చేసాడు కూడా. కఠిన పేదరికంలో ఉన్న రేణుకకు కొంత ఆర్ధికసాయం చేసిన వర్మ ఇప్పుడు ఆమె కోసం మరో సాయం చేయడానికి ముందుకొచ్చాడు.

IHG

 

దిశ ఘటన జరిగిన సమయంలో చెన్నకేశవులు భార్య రేణుక ఆరునెలల గర్భవతిగా ఉంది. ప్రస్తుతం రేణుక ఓ పాపకు జన్మనిచ్చింది. వీరిద్దరి ఫోటోను రామ్ గోపాల్ వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశాడు. ‘చెన్నకేశవులు భార్య రేణుక ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. కానీ రేపిస్టు చర్యతో వారిద్దరి భవిష్యత్తే అంధకారాన్ని తలపిస్తోంది. వారిద్దరి బాగు కోసం మీకు తోచినంత మొత్తాన్ని వారి అకౌంట్ కు జమ చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు. యాక్షన్ ఎయిడ్ ఫర్ సోసైటల్ అడ్వాన్స్ మెంట్ పేరుతో ఉన్న అకౌంట్ నెంబర్ ను, డిటైల్స్ ను ట్వీట్ లో మెన్షన్ చేశాడు.

 

 

రామ్ గోపాల్ వర్మ్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నీలో ఇలాంటి మానవత్వం ఉందా అని కొందరు అంటే, రేణుక కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు, అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లే వర్మ దిశ ఘటనపై సినిమా కూడా తీసే ఆలోచనలో ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఆర్జీవి తీసుకున్న నిర్ణయంతో రేణుకకు ఊరట దొరుకుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: