బాలీవుడ్ లో అత్యంత్య విజయవంతమైన ప్రభావంతమైన నటుడిగా సల్మాన్ ప్రసిద్ధి పొందారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమాలతో ఎంత బిజీగా ఉంటారో అందరికి తెలిసిన విషయమే. సల్మాన్ ఖాన్ ఎంత బిజీ షెడ్యూల్ లో ఉన్న  ఫ్యామిలీతో కొంత సమయాన్ని గడిపేస్తాడు. చెల్లెలి కుటుంబంతో టైమ్ గడుపుతూ అల్లుడుతో ఆడుకుంటాడు. సోదరి అర్పితా ఖాన్ తాజాగా షేర్ చేసిన మామ కోడలు చేష్టలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ వీరిద్దరు ఏం చేశారో ఓ సారి చూద్దాం.

 

సల్మాన్ ఖాన్ తన సోదరి అర్పిత వివాహాన్ని హైదరాబాదులోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో అంగరంగవైభవంగా జరిపించిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సుఖ్ రామ్ మనవడైన ఆయుష్ శర్మను పెళ్లాడిందామె. ఈ దంపతులకు ఆహిల్, ఆయత్ అనే పిల్లలున్నారు.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

We love you Mamu @beingsalmankhan

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

 

సల్మాన్ ఖాన్ తన బావ ఆయుష్ శర్మను బాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇప్పించాడు. నిర్మాతగా మారి లవ్ రాత్రి అనే చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండిగ. అది వేరే విషయం. సల్మాన్ ఖాన్ తన అల్లుడితో ఆడుతూ పాడుతూ ఉంటాడు. వీరిద్దరు చేసే అల్లరి సోషల్ మీడియాలోనూ ఫేమస్సే. అయితే తాజాగా వారి ఇంట్లోకి వచ్చింది ఆయత్. ఇక మేనకోడలు ఆయత్ ఇంట్లోకి రావడంతో వారి ఆనందం మరి రెట్టింపైంది.

 

మామ సల్మాన్ ఖాన్, కోడలు అయత్‌ కు ప్రేమగా ముద్దులు పెడుతున్నాడు. కోడలితో ఆడుకుంటున్న ఈ వీడియోను సోదరి అర్పితా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదే వీడియోను సల్మాన్ కూడా రీపోస్ట్ చేశాడు. ఇక మామ కోడళ్ల ప్రేమకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో రాధే సినిమాను చేస్తున్నాడు. ఈ వీడియోను చూసినవారంతా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: