పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీతో అదరగొడుతున్నాడు. ఎక్కడా ఆయన సౌండ్ చేయకుండా తన వర్క్ తాను చేసుకుపోతున్నారు. పవన్ కొత్త సినిమా వకీల్ సాబ్ స్టిల్ చాలు ఆయన క్రేజేంటో చెబుతోంది. ఇక పవన్ రీ ఎంట్రీతో ఊపుమీదున్న డైరెక్టర్లు నిర్మాతలు ఆయనతో మూవీస్ కి వరసగా క్యూ  కడుతూండడం మరో విశేషం.

 

ఇవన్నీ ఇలా ఉంచితే పవన్ 28వ సినిమాగా హరీష్ శంకర్ డైరెక్షన్లో బ్యాక్  గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందని అంటున్నారు. పవన్ తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ మూవీని తీసిన హరీష్ శంకర్ తో కాంబో కావడంతో ఫ్యాన్స్ సైతం హుషార్ గా  ఉన్నారు. ఈ మూవీ కోసం స్టోరీ డిస్కషన్లు సాగుతున్నాయి.

 

ఇక హీరోయిన్ విషయం కూడా చర్చకు వస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ని తీసుకుంటారని అంటున్నారు. గబ్బర్ సింగ్ మూవీ హిట్ పెయిర్ సెంటిమెంట్ రిపీట్ చేయాలని హరీష్ శంకర్ భావిస్తున్నాడుట. ఇక గబ్బర్ సింగ్ హిట్ అయినా కూడా కాటమరాయుడు మూవీ కూడా ఈ జోడీదే. అయితే ఆ మూవీ మాత్రం ఫ్లాప్ అయింది

 

అయినా సరే ఈ ఇద్దరూ తన డైరెక్షన్లో హిట్ కాంబో కాబట్టి రిపీట్ చేయడానికే హరీష్ డిసైడ్ అయ్యాడుట. ఇక శ్రుతి కూడా రీ ఎంట్రీ ఇస్తోంది. ఆమె రవితేజా మూవీ క్రాక్ లో చేస్తోంది. ఆమె చేతిలో కూడా కొత్త సినిమాలు లేవు. కాబట్టి పవర్ స్టార్ మూవీ అంటే ఠక్కున ఒప్పుకుంటుంది. మరి ఈ హిట్ కాంబోని పెట్టుకుని హరీష్ గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా అన్నది ఫ్యాన్స్ లో ఉత్కంఠగా  ఉందిట. మరి ఈ సినిమాని భారీ హిట్ గా చేయాలని అపుడే హరీష్ పక్కా ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: