తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సింగర్ గా పేరు తెచ్చుకుంటున్న రాహూల్ సిప్లిగంజ్ ఆ మద్య బిగ్ బాస్ 3 లో సందడి చేసిన విషయం తెలిసిందే.  నాగార్జున హూస్ట్ గా చేసిన బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహూల్ సిప్లిగంజ్ నిలిచారు.  అప్పటి నుంచి ఈ యువ సింగర్ సెలబ్రెటీ అయ్యారు. అంతే కాదు ఈ మద్య వెండితెరపై కూడా ఛాన్సులు వస్తున్నాయి.  ఈ క్రమంలో మొన్న గచ్చీబౌలి ఓ పబ్ లో గొడవ జరగడం.. అతనిపై దారుణంగా బీరు బాటిల్ తో దాడిచేసిన ఘటన సంచలనం రేపింది.  గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయిన రాహుల్ తనపై జరిగిన దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

 

ఈ ఫిర్యాదులో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి ఉన్నాడని రాహుల్ చెప్పాడు.  అయితే  పబ్‌లో జరిగిన గొడవలో తన తప్పేం లేదని చెప్పాడు ఈ సింగర్. మీడియా ముందుకు వచ్చి కూడా ఈయన తన గోడు వెల్లబోసుకున్నాడు.  ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కి పోస్ట్ చేశాడు.  పబ్ లో తన తప్పు ఏం లేదని.. వారే తనపై గొడవకు దిగారని.. అన్యాయంగా తనను కొట్టారని అన్నారు.  దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా పోస్ట్ చేశాడు.   

 

కేటీఆర్ గారూ నాకు న్యాయం కావాలి.. నేను టీఆర్ఎస్ పార్టీకే ఓటేసాను.. ఈ పార్టీ కోసమే నిలబడ్డాను.. బతికున్నంత వరకు కూడా ఈ నేల కోసమే పోరాడతాను అంటూ పోస్ట్ చేసాడు. తనకు న్యాయం జరగాలని.. అది మీరే చేయాలని కోరాడు. ఇంత వరకు బాగుంది కానీ ఇప్పుడు రాహూల్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.  నువు ఒక తెలంగాణ నెటిజన్ వి అయితే న్యాయంగా పోరాడు.. అంతే కానీ తెలంగాణ పార్టీకి ఓటేస్తే నీకు ప్రత్యేంగా న్యాయం చేయమని చెప్పడం ఓ సెలబ్రెటీ చెప్పే మాట కాదు అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: