డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన బద్రి సినిమా టాలీవుడ్ లో ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, ఎన్ని రికార్డ్స్ ని క్రియోట్ చేసిందో అందరికి తెలిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో టాప్ టెన్ సినిమాల లిస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఇక పూరి జగన్నాధ్ కి డెబ్యూ మూవీగా మంచి కమర్షియల్ సక్సస్ ని ఇచ్చి ఇక జీవితంలో తిరిగి వెనక్కి చూసుకోకుండా నిలిచిన సినిమా. పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో అలానే చూపించాడు పూరి జగన్నాధ్. ఆ తర్వాత పూరి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన కెమరా మాన్ గంగతో రాంబాబు సినిమాతో ఈ ఇద్దరు తమ ఖాతలో మరో సూపర్ హిట్ ని అందుకున్నారు. 

 

ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రాబోతోందని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి పూరి జగన్నాధ్ కథ చెప్పాడట. ఆ కథ పవన్ కళ్యాణ్ పొల్టికల్ కెరీర్ కి చాలా ఉపయోగపడుతుందని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని సీ.ఎం గా చూపించబోతున్నారని తెలుస్తోంది. జనాల కోసం అనుక్షణం తపించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని పూరి చూపించబోతున్నారట. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న సీ.ఎం పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉండబోతుందని సమాచారం. 

 

ఇక ఈ కథ తన రాజకీయ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని పూరి జగన్నాధ్ చాలా త్వరగా సినిమాని కంప్లీట్ చేస్తాడని పవన్ కళ్యాణ్ వెంటనే అంగీకరించారని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించని  అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ సినిమా లేదంటే పూరి సినిమాలోనే నటిస్తారని ఫిల్మ్ నగర్ లో న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

 

మొత్తానికి పవన్ కళ్యాణ్ ని సీ.ఎం గా చూపించబోతున్న పూరికి హ్యాట్సాఫ్ అంటున్నారు ఫ్యాన్స్. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, హిందీ, తమిళం లో రూపొందించాలని సన్నాహాలు చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. అయితే ఇప్పటివరకు భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తున్న  రాజమౌళి కి కూడా ఇది షాకే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: