టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అన్న బిరుదు బాధ్యత ఉంది ఇద్దరికే. అది తండ్రీ కొడుకులిద్దరికి ఉండటం అనేదు యాదృచ్చికం. అయినా ఇది సాధ్యమవడం అనేది అంత సులభం కాదు. కేవలం అది కృష్ణ గారికి ఆ తర్వాత మహేష్ బాబుకే సాధ్యమైంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడమే ప్రస్తుతం ఉన్న పోరులో తండ్రికి ఉన్న బిరుదుని దక్కించుకున్నాడంటే మహేష్ లో ఉన్న స్టామినా, కేపబులిటి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మహేష్ బాబు మొదటి నుంచి దర్శకుల, నిర్మాతల హీరో అని అంటారు. ఏ సినిమా అయిన ఒకసారి కమిటయ్యాడంటే ఆ సినిమాని బాధ్యతగా తీసుకోవడం తండ్రి కృష్ణ గారి దగ్గరనుంచే అలవాటు చేసుకున్నాడు మహేష్. ఇక దర్శకులకి రెస్పెక్ట్ ఇవ్వడంలోను మహేష్ బాబు అల్టిమేట్ అని అంటారు. 

 

అలాంటిది ఎందుకు జరుగుతోందో, ఎలా జరుగుతోందో గానీ ఒక్కో డైరక్టర్ మహేష్ బాబు కు దూరం అవుతున్నారు. ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దూరమయ్యారు. త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికి బాగా ట్యూన్ అయిందని అందరూ అనుకున్నారు. కాని ఈ ఇధ్దరి మధ్య ఏం జరిగింది అన్నది ఇప్పటి వరకు క్లార్టి లేదు. ఆ తరువాత సుకుమార్ ఉన్న పలంగా దూరమయ్యాడు. ఇక పూరి జగన్నాధ్ ను మహేష్ బాబు పట్టించుకోక పోవడం తో.. ఆయన దూరం అయ్యారు. పూరి మహేష్ బాబు కి పోకిరి, బిజినెస్ మాన్ వంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. అంతేకాదు వీరిద్దరి కాంబినేషన్ లో జనగనమణ అన్న హ్యాట్రిక్ సినిమా తెరకెక్కాల్సింది. కాని ఇద్దరికి దూరం పెరిగింది.  

 

ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ లో రాజమౌళి, కొరటాల శివ మాత్రమే మహేష్ కి కాస్త దగ్గరగా ఉన్నారు. కంప్లీట్ గా కొత్త దర్శకులతో సినిమా కమిటవరు. అనిల్ రావిపూడి లాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్ కూడా మన దగ్గర అంతగా లేదు. ఇక పరభాషా దర్శకులటే మురుగదాస్ లాంటి డైరక్టర్ కూడా సరైన హిట్ ని ఇవ్వలేకపోయారు. ఇక మాస్ సినిమాలు తీసే అట్లీ, ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే సాహసం చేయలేరు. అయితే త్రివిక్రమ్, సుకుమార్, పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు మహేష్ కి దూరమవడానికి  మహేష్ కి ఉన్న పర్సనల్ టీం అని తెలుస్తోంది. మరి ఈ విషయంలో నమ్రత కలగజేసుకుంటే మహేష్ కి డైరెక్టర్స్ కి మళ్ళీ ట్యూన్ అవుతుందని తెలుస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: