టాలీవుడ్ కి వైవిఎస్
చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన
గోవా భామ ఇలియానా, తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తన అందం, అభినయంతో
టాలీవుడ్ ప్రేక్షకుల మనసు దోచింది అనే చెప్పాలి. ఆ తరువాత
సూపర్ స్టార్ మహేష్, డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన
పోకిరి లో
హీరోయిన్ గా ఛాన్స్ కొట్టిన
ఇలియానా, అప్పట్లో ఆ
సినిమా అతి పెద్ద
చరిత్ర సృష్టించడంతో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించింది. దానితో ఇలియానాకు ఇటు
టాలీవుడ్ లోనే కాక, అటు
కోలీవుడ్ లో కూడా విపరీతంగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగిన ఇలియానాకు ఆ సమయంలో మంచి హిట్స్ తో పాటు కొన్ని పరాజయాలు కూడా ఎదురయ్యాయి.
దాదాపుగా
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసిన
ఇలియానా, కొన్నాళ్లుగా మాత్రం సినిమాలు చేయడం తగ్గించారు. దానికి కారణం, అదే సమయంలో తన బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో మునిగిపోయిన
ఇలియానా, ఆ తరువాత అతడితో కలిసి కొన్నాళ్లు ప్రేమాయణం కూడా నడిపింది. అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గాని, అనంతరం అతడి నుండి విడిపోయి మళ్ళి సినిమాల్లో నటించడం మొదలెట్టింది. అయితే ఆ తరువాత కొంత ఒళ్ళు చేసిన
ఇలియానా, ఇటీవల అయితే బాగా బొద్దుగా తయారయిందని చెప్పాలి. దానితో అక్కడక్కడా వస్తున్న కొద్దిపాటి అవకాశాలు కూడా చేజారడంతో కొంత నిరాశకు గురైన
ఇలియానా, ప్రస్తుతం తన శరీర బరువును పూర్తిగా తగ్గించుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఇటీవల ఎప్పటికప్పుడు తన ఫోటోలు సోషల్
మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తున్న ఇలియానాను చూస్తుంటే, మొన్నటితో పోలిస్తే ప్రస్తుతం కొంచెం బరువు తగ్గిందని, అందుకోసం ఆమె
ముంబై నుండి వచ్చిన ప్రత్యేక ఫిజికల్ ట్రైనర్ ల పర్యవేక్షణలో కఠినంగా వ్యాయామం,
యోగా వంటివి చేస్తూ తన ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేస్తోందని అంటున్నారు. ఇక పూర్తిగా బరువు తగ్గి ఒకప్పటివలె నాజూకుగా తయారవడానికి ఆమె పడుతున్న బాధలు అన్ని, ఇన్ని కావని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలు రావాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదని ఆమె సన్నిహితులు అంటున్నారట. మరి ఇల్లి బేబీ రాబోయే రోజుల్లో ఎంత మేర బరువు తగ్గుతుందో, ఆపై నాజూకు లుక్ ఆమెకు ఎంత మేర అవకాశాలు తెచ్చిపెడుతుందో చూడాలి.....!!