ఎన్నో అంచనాలతో గత శుక్రువారం విడుదల అయిన నితిన్ ‘హార్ట్ ఎటాక్’ ప్రేక్షకులకే కాదు నితిన్ అభిమానులకు కూడా హార్ట్ ఎటాక్ తెప్పించ లేదు సరికదా అసంతృప్తిని మిగిల్చింది. సినిమా విడుదల అయిన రోజు నుండి డివైడ్ టాక్ తో రన్ అవుతున్న ఈ సినిమా నితిన్ కు హ్యాట్రిక్ హిట్ ఇవ్వలేదు సరికదా, ఈసారి పవన్ నామస్మరణ మ్యాజిక్ పనిచేయలేదు అని టాలీవుడ్ లో సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం పూరి పవన్ ల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలతో ఈ సినిమాలో పవన్ నామస్మరణ డైరెక్ట్ గా లేకపోయినా ఈ సినిమా లో నితిన్ హీరోయిన్ తో అన్న డైలాగ్స్ ‘మాబాస్ చెప్పింది నిజమే మీ అమ్మాయిలు అర్డినరియే ఎక్స్ ట్రాడ్నరి కాదు’ అనే డైలాగ్ పవన్ ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమా నుంచి ప్రేరణగా నితిన్ చెప్పినా ఈసారి పవన్ నామస్మరణ టానిక్ నితిన్ కు హిట్ ఇవ్వలేకపోయిందని అంటు విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.  అయితే ఈ విషయాలు ఏమీ పట్టించు కోకుండా నితిన్ తన రెమ్యునరేషన్ తోనే నిర్మాతలకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నాడట. ‘హార్ట్ ఎటాక్’ వరకు మూడు కోట్లు తీసుకున్న నితిన్ ఇప్పుడు ఒక్కసారిగా ఐదు కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. నితిన్ ప్రస్తుతం ఉన్న ఫాంకి ఐదు కోట్లు ఇవ్వడం కరక్టే అని కొందరంటుంటే. సినిమా పాజిటివ్ టాక్ వస్తే ఐదు కాదు ఆరిచ్చినా డోకా లేదు. కానీ నెగటివ్ టాక్ వస్తేనే కష్టం అంటూ కొందరి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారట. అయినా నితిన్ ఇవేమీ పట్టించు కోకుండా తన ధోరణిలో తాను పోతు నిర్మాతల దగ్గర తన పారితోషికాన్ని పిండే కార్యక్రంలో బిజీగా ఉన్నాడట పవన్ వీరాభిమాని నితిన్.   

మరింత సమాచారం తెలుసుకోండి: