ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. దాదాపు 89 దేశాలో ఈ వైరస్‌ ప్రభావం కనిపించటంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యవరసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించారు. ఇప్పటికే చైనాలో ఈ వైరస బారిన పడి దాదాపు 3000 మంది మరణించగా 80 వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఇక వరల్డ్‌ వైడ్‌గా ఈ సంఖ్య మరింత భారీగా ఉండే అవకాశం ఉంది. కరోనా ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ అలవాట్లను మార్చుకోవాలని వైధ్యులు సూచిస్తున్నారు.

 

ముఖ్యంగా షేక్‌ హ్యాండ్‌ లు, ఆలింగనాలు ఇవ్వ వద్దని సూచిస్తున్నారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి అత్యంత వేగంగా సోకే ప్రమాదం ఉండటంతో ఈ పద్దతులు తప్పని సరిగా పాటించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్‌ మారింది. సల్మాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మ ఇటీవల తన రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. చెల్లెలి బిడ్డల విషయంలో ఎంతో ప్రేమగా ఉండే సల్మాన్‌ తరుచూ వాళ్లతో కలిసి చేసిన అల్లరి పనుల వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తుంటాడు.

 

అలాంటి వీడియోను తాజాగా అభిమానుల కోసం షేర్ చేశాడు. తన చిట్టి కోడలికి ముద్దులు పెడుతూ సల్మాన్‌ తీయించుకున్న ఈ వీడియోపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా భయంతో ప్రపంచమంతా షేక్‌ హ్యాండ్‌ లే మానేస్తుంటే సల్మాన్‌ ఇలా  మూతు ముద్దులు, అది కూడా ఓ పసి పాపకు పెట్టడం ఏంటి అని పెదవి విరుస్తున్నారు. ఎంత ప్రేమ ఉన్న కాస్త జాగ్రత్త కూడా ఉండాలని సూచిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్‌ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధే సినిమాలో నటిస్తున్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

#repost @arpitakhansharma ・・・ We love you Mamu @beingsalmankhan

A post shared by salman Khan (@beingsalmankhan) on

మరింత సమాచారం తెలుసుకోండి: