ఎప్పుడు నవ్వుతూ షూటింగ్ స్పాట్ లో జోక్స్ వేస్తూ కనిపించే బాలకృష్ణ తన తీరుకు భిన్నంగా బోయపాటి లేటెస్ట్ మూవీ షూటింగ్ స్పాట్ లో తీవ్ర అసహనంతో రగిలిపోతూ కనిపించడం చూసి ఆ మూవీ యూనిట్ వర్గాలు షాక్ అవుతున్నట్లు టాక్. అంతేకాదు ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ షూటింగ్ స్పాట్ లో బాలకృష్ణ ప్రవర్తిస్తున్న తీరును చూసి బాలయ్యకు ఏమైంది అంటూ షూటింగ్ స్పాట్ లో ఉన్న యూనిట్ సభ్యులు షాక్ అవుతున్నట్లు టాక్.


తెలుస్తున్న సమాచారం మేరకు బాలయ్యకు ఈ విధంగా కోపం రావడానికి ఈ మూవీకి సంబంధించి నటీనటుల ఎంపిక విషయంలో అదేవిధంగా సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో బోయపాటి అనుసరిస్తున్న విధానాలు అని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ తగ్గించడం విషయం దగ్గర నుండి చివరకు తన పారితోషికం విషయంలో కోత పెట్టడం వరకు అన్నీ బాలయ్య ఇష్టానికి వ్యతిరేకంగానే నిర్ణయాలు జరిగాయి అని అంటున్నారు.


దీనికితోడు బాలకృష్ణ సినిమాల మార్కెట్ విపరీతంగా పడిపోవడం కూడ బాలయ్యకు ఈ విధంగా అసహనాన్ని కలిగించి ఉంటుంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తో ఘోర అవమానం. ఆతరువాత తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి మోక్షజ్ఞ విషయంలో బాలయ్యకు పెరిగిపోతున్న అసంతృప్తి అన్ని విషయాలు కలిపి బాలయ్యను ఇలా ప్రతి చిన్న విషయానికి షూటింగ్ స్పాట్ లో సహనం కోల్పోయే లా చేస్తున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


అయితే ఈ సినిమా హిట్ కావడం బాలయ్య కంటే బోయపాటికి కెరియర్ పరంగా చాల అవసరం అయిన పరిస్థితులలో బాలకృష్ణ కోపాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా బోయపాటి తన పని తాను చేసుకుపోతూ షూటింగ్ స్పాట్ లో చాల కూల్ గా ఉంటున్నట్లు సమాచారం. అంతేకాదు తన యూనిట్ సభ్యులను కూడా బాలయ్య అసహనాన్ని లైట్ గా తీసుకోమని చెపుతూ ఏ విషయంలోనూ బాలయ్యను కవ్వించ వద్దు అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: