హీరో అంటే ఎలా ఉండాలి.. మంచి ప్రవర్తనతో.. మంచి నడవడికతో ఉండాలి..  పాతకాలం సినిమాల్లో హీరోలు చాలా డిగ్నిఫైడ్ గా ఉండేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా హీరోలు మారుతూ వచ్చారు. ఎంతలా అంటే హీరోగా ఉండాల్సిన హీరో కాస్త విలగా మారెంతలా అన్నమాట. అవును హీరో అంటే ఇలానే ఉండాలి.. ఇలానే ప్రవర్తించాలన్న మూస ధోరణికి మంగళం పాడేసిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే అని చెప్పొచ్చు.

 

ఎవరైనా హీరోకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అనుకుంటాడు. కాని రౌడీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలని అనుకోవడమే దేవరకొండ విజయ్ స్పెషల్. ముందు చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తూ వచ్చి ఫైనల్ గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్ గా చేరిన విజయ్ ఆ సినిమాలో సెకండ్ లీడ్ గా చేయడం విశేషం. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నాని మెయిన్ లీడ్ కాగా విజయ్ ఉన్నంతసేపు ఆకట్టుకున్నాడు.

 

ఆ తర్వాత పెళ్లిచూపులు చేయగా అది సూపర్ హిట్ అయ్యింది. ఇక ఆ నెక్స్ట్ వచ్చిన అర్జున్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. విజయ్ దేవరకొండ ఇమేజ్ ను పెంచిన సినిమా అది. అంతేకాదు దేవరకొండకు యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చిన సినిమాగా కూడా అర్జున్ రెడ్డిని చెప్పుకోవచ్చు. అప్పటి నుండి రీసెంట్ గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ వరకు దేవరకొండ విజయ్ ప్రతి సినిమాకు తన మార్క్ చూపించాలని అనుకుంటున్నాడు.  సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు వస్తాయన్న మాటని మార్చేలా.. ఎంచుకున్న పాత్రకు పూర్తి న్యాయం చేసేలా విజయ్ దేవరకొండ ఎప్పటికి ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడు. కొంతమంది హీరోలు దశాబ్ద కాలంగా సినిమాలు చేస్తున్నా రానటువంటి క్రేజ్ కేవలం ఐదారు సినిమాలతోనే సాధించిన విజయ్ ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి మరెన్నో హిట్ సినిమాలు తీసి తన స్టామినా మరింత పెంచుకోవాలని ఆశిస్తుంది ఇండియాహెరాల్డ్.కామ్ టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: