టాలీవుడ్ లో అక్కినేని వారి కోడలు సమంత కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఎంతోమంది స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రల్లో నటించింది సమంత. ఇక మొదటి సినిమాతోనే నాగచైతన్య తో ప్రేమాయణం కొనసాగించి... ఆ తర్వాత పెళ్లితో ఒక్కటయ్యారు ఈ జంట. ఇక అక్కినేని కోడలిగా మారిపోయిన తర్వాత సమంత క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఇక పెళ్లి తర్వాత సమంతకి అదృష్టం కూడా బాగానే కలిసొచ్చింది అనే చెప్పాలి. ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్  హిట్ గా  నిలుస్తున్నాయి . ఇక పెళ్లి తర్వాత గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరమైన సమంత కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ కెరియర్ లో దూసుకుపోతుంది. 

 

L

 

 ప్రస్తుతం ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో మంది హీరోయిన్లకు ఇన్స్పిరేషన్ గా ఉంటుంది అక్కినేని వారి కోడలు సమంత. ఒకప్పుడు బొద్దుగా ముద్దుగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం సన్న  జాజిపువ్వుల మారిపోయింది. ఇక ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది సమంత. ఇకపోతే సమంత అసిస్టెంట్ ఆర్య తాజాగా ఒక రెస్టారెంట్ అని ప్రారంభించగా దీనికి రిబ్బన్ కట్ చేసేందుకు  ముఖ్యఅతిథిగా సమంతను  ఆహ్వానించాడు. ఈ సందర్భంగా రెస్టారెంట్ ఓపెనింగ్ కి వచ్చిన సమంత తన అసిస్టెంట్ ఆర్య గురించి కాస్త ఎమోషనల్ అయ్యింది. 

 

 

 ఏమాయ చేసావే సినిమా నుంచి ఇప్పటివరకు తన అసిస్టెంట్ గా కొనసాగుతున్నాడు.. ఆర్యకు  తనకు మంచి అనుబంధం ఉంది అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు ఆర్య 11 ఏళ్ల నుంచి తనతో ట్రావెల్ చేస్తున్నాడు అంటూ సమంత తెలిపింది. ఈ 11 ఏళ్లలో ఆర్య తన పేరెంట్స్ కంటే తనను ఎంతో కేరింగ్  తీసుకుని జాగ్రత్తగా చూసుకుంటాడని సమంత చెప్పుకొచ్చింది. ఆర్య లో ఎప్పుడూ ఒక ఫైర్  కనిపించేదని అసిస్టెంట్ గానే మిగిలిపోవడం కాదు ఇంకా ఏదో సాధించాలనే తపన ఎప్పుడూ ఆర్య లో  కనిపించేది అంటూ సమంత చెప్పుకొచ్చింది. తన అసిస్టెంట్ ఆర్య రెస్టారెంట్ ని ప్రారంభించడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సమంత తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: