సమాజంలో పలికుబడి పేరు రావడానికి చాలా కష్టపడాలి.. అదే చెడ్దపేరు రావడానికి ఎలాంటి కష్టం అవసరం లేదు.. ఒక వెధవపని, చేస్తే చాలు పదిమందిలో వెధవ అయిపోవచ్చూ.. ఒక చెడ్ద పని చేస్తూ నలుగురి కంట పడితే చాలు వీడు వట్టి బోకుగాడురా అనే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది.. అయితే ఇలాంటి పనులు అందరు చెయ్యాలంటే వీలుకాదు.. ఎందుకంటే సమాజం అంటే భయం, సిగ్గు, శరం ఉన్న వారు అసలే వీటి జోలికి వెళ్లరు.. ఇక అన్ని వదిలేసి ఏదో ఒంటి మీద గుడ్దలను నామమాత్రంగా ఉంచుకున్న వారు, తల్లిదండ్రులు ముఖం మీద ఉమ్మేసిన, కట్టుకున్నది నోట్లో కాండ్రకించిన తుడిపేసుకుని ఇలాంటి అడ్దమైన దార్లో ప్రయాణిస్తారు..

 

 

ఇకపోతే మార్చి 4వ తేదిన వ్యభిచారం కేసులో ఇరుక్కుని అరెస్ట్ అయినా జబర్దస్ద్ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి.. జబర్దస్ద్ పరువు మొత్తం తీసేసారని అనుకుంటున్నారు.. ఒక షో పరువే కాదు.. మల్లెమాల సంస్దను కూడా బద్నాం చేశారు.. అన్నం పెట్టిన ఇంటికే సున్నం పెట్టారంటే ఇదే కాబోలు.. అసలు మల్లెమాల సంస్ద మీకు ఏం తక్కువచేసిందని ఇలా చేశారని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇక వీరు ఇలా పట్టుబడటం వల్ల వారి ఇంటిపేరు గానీ, ఊరిపేరుతో గాని ఎవరు పిలువలేదు.. జబర్దస్ద్ నటులు, మల్లెమాల సంస్దలో ఉన్న వారు అనే పదాన్నే వాడారు.. దీన్నిబట్టి ఏం అర్ధం అవుతుందంటే పోయింది మల్లెమాల పరువుగాని, దొరబాబు, పరదేశిల పరువు కాదు..

 

 

ఇక బుల్లితెర మీద ఒక్కసారి కనిపించాలని, అందులో జబర్దస్ద్ షోలో చేయాలని ఎందరో యువకులతో పాటుగా, ప్రతివారు ఆశపడుతారు.. ఇలాంటి అవకాశాన్ని కేవలం సుఖానికో, డబ్బులకో కక్కూర్తి పడి చేజేతులారా నాశనం చేసుకున్న దొరబాబు, పరదేశిలను పిచ్చివారనలా, వెర్రివాళ్లనాల. పిలిచి అన్నం పెడితే తినే పళ్లాన్ని నేలకేసి కొట్టారట వెనకటికి కొందరు బుద్ధిలేని వారు.. వీరిపరిస్దితి ఇలానే ఉంది.. నిన్న మొన్నటి వరకు నవ్వుతూ పలకరించే రోజా గారు కూడా వీరిని చూసి అసహ్యంగా ముఖం చాటేసారంటే వీరి పరిస్దితి ఎంతకు దిగజారిందో అర్ధం అవుతుంది..

 

 

అంటే దొరకనంత కాలం దొరలు, దొరికితే దొంగలు.. ఇంకా ఇలాంటి వారు ఎందరున్నారో మల్లెమాల పరువు తీయడానికి.. అని అనుకుంటున్నారట కొందరు అభిమానులు.. ఏది ఏమైనా బంగారం లాంటి అవకాశాన్ని, పేరును ఒకే ఒక్క తప్పుతో నాశనం చేసుకున్నారు ఈ నటులు..

మరింత సమాచారం తెలుసుకోండి: