టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతగా గౌరవం ఇస్తారో అందరికీ తెలిసిందే.  సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా వెలిగిపోతున్నారు.  బాలయ్య ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  తండ్రికి తగ్గ తనయుడు గా సాంఘిక, పౌరాణిక, జానపద సినిమాల్లో నటించారు.  ఆయన తన వందవ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి చారిత్రక సినిమా లో నటించారు. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు.  అయితే ఎమ్మెల్యే హోదాలో ఆయనకు కొన్ని ప్రత్యేక గౌరవాలు.. ప్రోటోకాల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే.  అనంతపురం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న లేపాక్షి ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రాధాన్యత కల్పించకపోవడం చర్చనీయాంశమైంది.   

 

లేపాక్షి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేస్తుంటారు.  ఇక్కడికి ప్రముఖులు విచ్చేస్తుంటారు.  సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పార్టీలను పక్కన పెట్టి ప్రొటోకాల్‌ పాటిస్తారని, అయితే ఇక్కడ మాత్రం బాలయ్యకు అవమానం జరిగినట్టే అనిపిస్తుందని అంటున్నారు. లేపాక్షిలో నిర్వహించే ఉత్సవాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ ఫొటో ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  కేవలం ఆహ్వాన పత్రికలో పేరు తప్ప, సభావేదిక, ఆహ్వాన తోరణాలు, ఫ్లెక్సీల్లో ఎక్కడా ఫొటో కనిపించడం లేదని తెలుస్తోంది.  సిని ప్రముఖలు వస్తున్నారంటేనే ఫ్లెక్లీ ల్లో ఫోటోలు భారీ ఎత్తున పెడుతుంటారు. 

 

అలాంటిది ఎమ్మెల్యే హోదా, నటుడు బాలయ్య ఫోటోలు కనిపించకపోవడం పై అందరూ ఆశ్చర్యపోయారు. స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణకు ఉత్సవాల్లో ప్రాధాన్యత తగ్గించారనే టాక్ వినిపిస్తోంది. గతంలో లేపాక్షిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు దానికి మరింత ప్రాచుర్యం పొందేలా చేయడంలో బాలకృష్ణ అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహించారు.  విచిత్రం ఏంటంటే గతంలో కాంగ్రెస్ పాటనలో ఉన్నపుడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తే టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారని... కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిబంధనలు పాటించడం లేదని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: