రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ నటిస్తున్న జూనియర్ కు హీరోయిన్ విషయంలో అన్యాయం జరిగిందని జూనియర్ అభిమానుల అభిప్రాయం. దీనికి కారణం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ అలియా భట్ ను రామ్ చరణ్ కు జోడీగా ఎంపిక చేసి జూనియర్ కు హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోర్రిస్ హీరోయిన్ గా రాజమౌళి ఎంపిక చేసాడు. 


సినిమా కథ రీత్యా కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్న జూనియర్ ను బ్రిటీష్ ఆర్మీ జనరల్ కూతురు ప్రేమిస్తుంది అన్న ట్విస్ట్ ఉండటంతో జూనియర్ కు ఒలీవియా మోర్రిస్ ఎంపిక చేయడం జరిగింది. అయితే క్రేజీ బ్యూటీ అలియా భట్ చరణ్ పక్కన ఉంటే జూనియర్ పక్కన పెద్దగా పేరులేని హాలీవుడ్ బ్యూటీ ఏమిటి అంటూ తారక్ అభిమానులకు అసంతృప్తి కలిగింది.


ఇప్పుడ ఈవిషయాలు త్రివిక్రమ్ దృష్టి వరకు వెళ్ళినట్లు ఉన్నాయి. అందుకే ఈసంవత్సరంలో ప్రారంభంకాబోయే త్రివిక్రమ్ జూనియర్ ల మూవీలో హీరోయిన్ గా అలియా భట్ ను ఎంపిక చేసే విధంగా ప్రస్తుతం త్రివిక్రమ్ రాయబారాలు కొనసాగుతున్నట్లు టాక్. వాస్తవానికి ఈమూవీలో హీరోయిన్ గా మొదట్లో రష్మిక అనుకున్నారు ఆతరువాత పూజ హెగ్డే వైపు త్రివిక్రమ్ ఆలోచనలు మళ్ళాయి. 


అయితే జూనియర్ కెరియర్ లో 30వ సినిమాగా నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీకి ప్రారంభం నుండి విపరీతమైన క్రేజ్ రావాలి అంటే ఈ మూవీలో హీరోయిన్ గా అలియా భట్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలు త్రివిక్రమ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ అలియా భట్మూవీ ప్రాజెక్ట్ పై పెద్దగా ఆసక్తి కనపరచకపోతే భారీ పారితోషికం ఇచ్చి అయినా శ్రీదేవి కూతురు జాన్వీ  కపూర్ ను ఎంపిక చేయడానికి త్రివిక్రమ్ జాన్వీ తండ్రి బోనీ కపూర్ తో కూడ రాయబారాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఒకప్పుడు చిరంజీవి నటించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ మూవీ ఛాయలతో ఉండే ఈకథకు పూర్తి తెలుగుదనం ఉండేలా ‘అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్ ప్రస్తుతం త్రివిక్రమ్ ఆలోచనలలో ఉన్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీ కథలో జూనియర్ పాత్ర మంత్రి కుమారుడికి తన చెల్లిని ఇచ్చి పెళ్లి చేసేందుకు హీరో చేసే ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ నడుస్తుందని సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: