వారం వారం విడుద‌ల‌య్యే సినిమాల‌తో వీకెండ్ మొత్తం ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేస్తారు సినీ ప్రేమికులు. అయితే ఈ వారం విడుద‌లైన చిత్రాల్లో ప‌లాస‌, ఓ పిట్ట‌క‌థ‌, అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి, కాలేజ్ కుమార్‌, స్క్రీన్ ప్లే చిత్రాలు 6వ తారీఖు అన‌గా శుక్ర‌వారం విడుద‌ల‌య్యాయి. మ‌రి ఈ చిత్రాలు ఎలా ఉన్నాయో ఈ వారం ఏ సినిమా చూడాలో ఓసారి ఓ లుక్కేద్దాం...

 

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పలాస 1978′. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్ విడుద‌ల చేసింది. ఇక ఈ చిత్రం సహజంగా సాగే పాత్రలు, సినిమా చూస్తున్నంత సేపు పలాస అనే ప్రాంతానికి వెళ్లి ఆ పాత్రలను మనం దగ్గరనుండి చూస్తున్నభావ‌న మ‌న‌కు క‌లుగుతుంది. అలాగే డైరెక్టర్ రాసుకున్న సున్నితమైన ఎమోష‌న్స్‌ కొన్ని చోట్ల ఆశ్చార్యాన్ని క‌లిగిస్తాయి. హీరోరక్షిత్ సరసన కథానాయకిగా నటించిన నక్షత్ర తన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు తన గ్లామర్ తో పాటుగా తన నటనతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో మరియు ప్రేమ సన్నివేశాల్లో ఆమె బాగానే నటించింది. వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింద‌నే చెప్పాలి. అయితే, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం, మోటివ్ సీన్స్ ఇంకా బలంగా ఉండాల్సిందనే ఫీలింగ్ కలిగింది. అందరూ నూతన నటినటులతోనే(మార్కెట్ పరంగా) సినిమాని తెరకెక్కించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి. అయినప్పటికీ ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతంలో జరిగిన ఈ సినిమా ప్రత్యేక ముద్రను వేస్తోంది. సినిమాని చూసిన చాలా మంది ప్రేక్ష‌కులు బావుంద‌నే మాటే అంటున్నారు.

 

విశ్వంత్‌ దుద్దంపూడి, సంజయ్‌ రావు, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై వి.ఆనందప్రసాద్‌ నిర్మించారు. చెందు ముద్దు దర్శకుడు. ఇక ఈ చిత్రం కొన్ని చోట్ల సప్సెన్స్ తో పాటు కొన్ని థ్రిల్లింగ్ స‌న్నివేశాల‌తో పాటు అక్కడక్కడా కామెడీ టచ్ తో బాగానే పర్వాలేదు అనిపించుకుంది. ఐతే సెకెండ్ హాఫ్ లో మాత్రం చివరి ముప్పై నిముషాల ప్లే దర్శకుడు చందు బాగా తెరకెక్కించారు. ఆ ముప్ఫై నిముషాల సినిమా చాలా బాగుంది. కానీ కొన్ని సీన్స్ రిపీట్ డ్ కావడం, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే ఈ సినిమా కాస్త స‌స్పెన్స్ జోన‌ర్ కాబ‌ట్టి ఆ జోన‌ర్‌ని ఎక్కువగా ఇష్ట‌ప‌డేవారికి న‌చ్చుతుంది. మొత్తానికి ప‌ర్వాలేద‌నే టాక్ అయితే వ‌చ్చింది.

 

ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని ప్రధాన పాత్రలలో తెరకెక్కిన థ్రిల్లర్ అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి. ప్రధాన పాత్రల్లో న‌టించిన‌ ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, కోమలి ప్రసాద్, సిద్ధి ఎడ్నాని బోల్డ్ కంటెంట్ రోల్స్ లో చాలా చక్కగా నటించారు. ఇక  సినిమాలో వీరి గ్లామర్ మెప్పిస్తుంది. ధాన్యా బాలకృష్ణ అటు గ్లామర్ పరంగా ఇటు ఎమోషన‌ల్ సీన్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్ చేసింది. అనుకొన్నది ఒక్కటి అయినది ఒక్కటి అక్కడక్కడా ఆకట్టుకొనే థ్రిల్లర్.  అంటే పూర్తి స్థాయిలో ఏ అంశం ఆక‌ట్టుకోలేదు. అటు కామెడీ కానీ, పాత్రల మధ్య ఎమోషన్స్ కానీ పండక పోవడం వలన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. 

 

రాహుల్ విజయ్, ప్రియా వడ్లమాని జంటగా రాజేంద్ర ప్రసాద్, మధుబాల ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం కాలేజ్ కుమార్. ఓల్డ్ స్కూల్ ఫార్మట్ లో సాగే ఈ కాలేజ్ కుమార్ అంతగా ఆకట్టుకోలేదు ఈ చిత్రం. తాను ఎంచుకున్న కథను ఎమోషన్ తో మొదలుపెట్టి  మంచి హ్యూమర్ తో ముగించాలనుకున్నాడు కాని అది దర్శకుడికి కుద‌ర‌లేదు. సినిమాలో అటు హ్యూమర్ కానీ, సెంటిమెంట్ కానీ వర్క్ అవుట్ కాలేదు. ఈ చిత్రం కూడా అంత‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పాలి.

 

విక్రమ్ శివప్రగతి యాదాటి హీరోహీరోయిన్లుగా వచ్చిన  సినిమా ‘స్క్రీన్ ప్లే’‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’  అన్న‌ది ట్యాగ్ లైన్‌. బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి ఈ చిత్రాన్ని నిర్మించారు. పరిశ్రమ వర్గాల్లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అయ్యారు. అంతేకాక ఆయ‌న ఈ చిత్రంలో ఓ పాత్ర‌ని కూడా పోషించారు. ‘స్క్రీన్ ప్లే’ అంటూ ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ చిత్రం కథాంశం పరంగా ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమా చాలా నెమ్మ‌దిగా సాగుతూ బోర్ కొట్టిస్తుంది. అయితే కేవలం మూడు క్యారెక్టర్లు మాత్రంమే సినిమాని ఎమోషనల్ గా నడపటానికి దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడ‌ని చెప్పాలి. కానీ సినిమా మాత్రం అనుకున్న  అస‌లు ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: