టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.  జయం చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన నితిన్ తర్వాత దిల్ చిత్రంతో మరో విజయం అందుకున్నాడు.  వరుసగా రెండు హిట్ చిత్రాలతో  హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  దాదాపు పదిహేనేళ్లు దాటిన కెరీర్ పరంగా పెద్దగా విజయాలు సాధించకున్నా హీరోగా ఎక్కడా డ్యామేజ్ జరగకుండా నెట్టుకొస్తున్నాడు.  హీరోగా సక్సెస్ లు తనకు పెద్దగా లేకున్నా.. నటుడిగా తన సత్తా చాటుతున్నాడు.  టాలీవుడ్ లో బ్యాచ్ లర్ హీరోల్లో ఒకరైన నితిన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. 

 

అయితే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది.  త్వరలో పెళ్లి జరగబోతున్న నితిన్ పై సోషల్ మీడియాలో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 'షాలినితో హీరో నితిన్ పెళ్లి వాయిదా?' అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇందులో నిజం లేదని ఇరు వర్గాల పెద్దలు చెబుతున్నారు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా బీభత్సం సృష్టిస్తున్న విలయతాండవం గురించి అందరికీ తెలిసిందే.  దాంతో ఇప్పుడు కొన్ని చిత్రాలు వాయిదాలు పడుతున్నాయి.  షూటింగ్ లు సైతం వాయిదాలు పడుతున్నాయి.  కరోనా  ఎఫెక్ట్‌ నితిన్‌ పెళ్లిపై కూడా పడిందని ప్రచారం జరుగుతోంది.

 

నాగర్‌కర్నూల్‌కు చెందిన ‌సంపత్‌కుమార్‌, నూర్జహాన్‌ దంపతుల రెండవ కుమార్తె షాలినితో ఇటీవ‌ల‌ నితిన్‌కు నిశ్చితార్థం జరిగింది.  అంతే కాదు నితిన్ నటించిన భీష్మ చిత్రంపై కూడా కరోనా ప్రభావం పడినట్టు వార్తలు వస్తున్నాయి.   ఇప్పుడు థియేటర్లకు వెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు.  ముఖ్యంగా జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశంలో తిరగకూడదు అన్న భయంతో జనాలు మాల్స్ కి రావడం మానేశారు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఏప్రిల్‌ 16న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు.  ఏప్రిల్‌ 21న హైటెక్స్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు.  నితిన్ పెళ్లి పై స్పందించిన కుటుంబ సభ్యులు ఇవన్నీ రూమర్లు అని.. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: