స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలు చెయ్యకుండా నిదానంగా వన్ బై వన్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు.  యంగ్ హీరోలు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్కుంటుంటే..రామ్ చరణ్, మహేష్ లాంటి వాళ్లు  నెక్ట్స్ సినిమా మాత్రం ఇంకా ఫైనల్ చెయ్యకుండా పాజ్ ఇఛ్చి నిదానంగా చేస్కుందాంలే అని  ఆలోచిస్తున్నారు.

 

మహేష్  బాబు సరిలేరునీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత 3 నెలలుగ్యాప్ తీసుకుంటానని ముందే చెప్పిన మహేష్.. వన్ మన్త్ అయినా  ఇప్పటి వరకూ నెక్ట్స్ సినిమా అనౌన్స్ చెయ్యలేదు. వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నానని మహేష్ చెప్పినా.. ఇప్పుడు ఆ సినిమా ఆగిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

 

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ అల్లూరిసీతారామరాజుగా కనిపించబోతున్నాడు. జనవరిలో రిలీజ్ అయ్యే ఈ సినిమా కోసం ఫుల్ టైమ్ ఇస్తున్నాడు చరణ్. అయితే ఆర్ఆర్ఆర్ అయిపోయిన తర్వాత ఏం సినిమా చేస్తాడన్నది మాత్రం ఇంకా ఫైనల్ చెయ్యలేదు చరణ్. యంగ్ టైగర్ కూడా రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్  షూట్ లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబందించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఎన్టీఆర్, త్రివిక్రమ్ తో నెక్ట్స్ సినిమా ప్లాన్ చేశాడు. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ చేసినా షూటింగ్ మాత్రం మే లో ప్లాన్ చేస్తున్నారు.

 

అలవైకుంఠపురంలో సినిమాతో అదిరిపోయే సక్సెస్ సంపాదించిన అల్లు అర్జున్.. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సుకుమార్ తో సినిమా అనౌన్స్ చేశాడు బన్నీ. ఆల్రెడీ ఈ సినిమాకు సంబందించి బన్నీ లేకుండా  ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది.  బన్నీ మాత్రం ఇంకా ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వలేదు అల్లు అర్జున్ .

మరింత సమాచారం తెలుసుకోండి: