చరణ్ నెక్ట్స్ ఏం సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. చరణ్ ఇప్పటికే కొంతమంది డైరెక్టర్లు చెప్పిన స్టోరీలు వినేశాడు. అంతకుముందు లిస్ట్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లను కాదని చరణ్ జస్ట్ రెండంటే రెండే సినిమాలు చేసిన యంగ్ డైరెక్టర్ తో మూవీ ఓకే చేసేశాడా..? రామ్ చరణ్ ..ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి ఆర్ఆరఆర్ షూట్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకో 2..3 నెలల్లో కంప్లీట్ చేసుకునే చరణ్ ..నెక్ట్స్ సినిమా కోసం డైరెక్టర్ల వేట మొదలుపెట్టాడు. చరణ్ తో సినిమా చేద్దామని ఇప్పటికే రెడీ గా చాలా మంది డైరెక్టర్లు ఉంటే.. ఇప్పుడు వాళ్లందర్నీ వెనక్కి నెట్టి .. వెంకీ కుడుముల లిస్ట్ లో ఫస్ట్  ఉన్నాడు.

 

వెంకీ కుడుముల ఫస్ట్ సినిమా ఛలో తో చాలా రోజుల నుంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న నాగశౌర్యకు హిట్ ఇచ్చాడు. రీసెంట్ గా నితిన్ తో చేసిన భీష్మ సినిమా కూడా  సూపర్ హిట్ అయ్యి నితిన్ కి మెమరబుల్ హిట్ అందించింది. ఫ్రెష్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న వెంకీ చెప్పిన స్టోరీ చరణ్ కు నచ్చడంతో వెంకీ తోనే సినిమాకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. వెంకీ కన్నా ముందే అనిల్  రావిపూడి..చరణ్ తో  మంచి కమర్షియల్ కామెడీ ఎంటర్ టైనర్ చేద్దామని లైన్ కూడా రెడీ చేశాడు.  కానీ అనిల్ స్టోరీకి అంతగా ఇంప్రెస్ అవ్వలేదట చరణ్. కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తున్న అనిల్ కామెడీ జానర్ తనకు అంతగా సూట్ కాదని నో చెప్పాడట చరణ్.  

 

చరణ్ తో సినిమా చేద్దామని ముందు నుంచే ఖర్చీఫ్ వేసుకున్నాడు సురేందర్ రెడ్డి. సూరితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ కి ఫిదా అయిపోయిన చరణ్.. ధృవ చేసేటప్పుడే సురేందర్ తో మరో సినిమా చేస్తానని కమిట్ అయ్యాడు . అందుకే  సురేందర్ కూడా చెర్రీ కోసం స్టోరీ రెడీ చేస్తున్నాడు. లిస్ట్ లోకి ఎంటర్ అయిన గౌతమ్ తిన్ననూరి మీద కూడా ఇంట్రస్ట్ చూపించాడు చరణ్. నాని తో జెర్సీ చేసి  సూపర్ సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి.. జెర్సీ హిందీ రీమేక్ షూట్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సమ్మర్ లోపు కంప్లీట్ అవుతుంది. రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ కూడా ఆల్ మోస్ట్ అదే టైమ్ కి ఫినిష్ అవుతుంది కాబట్టి.. కెరీర్ లో గౌతమ్ తో ఎక్స్ పెరిమెంట్ చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నాడు చరణ్. మరి ఆఖరికి ఆ ఛాన్స్ ఎవరికిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: