తెలుగు సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ లో 350 కోట్లు.. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా తీసెయ్యెచ్చు. మీడియం బడ్జెట్ సినిమాలు 5 తియ్యొచ్చు. నార్మల్ బడ్జెట్ సినిమాలైతే  10 చెయ్యోచ్చు. కానీ ఈ 350 కోట్లు  ఆర్ఆర్ఆఱ్  సినిమా చేస్తున్నందుకు రాజమౌళికి ఇస్తున్న రెమ్యూనరేషన్. 400 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాకి రాజమౌళి 350 కోట్లు తీసుకుంటున్నాడా..? 

 

ఫిక్షన్ బేస్డ్ రివల్యూషనరీ సినిమాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న టాలీవుడ్ మ్యాగ్నమ్ ఓపస్  ఆర్ ఆర్ఆర్ సినిమా 400 కోట్లతో తెరకెక్కుతోంది. డివివి దానయ్య ప్రొడక్షన్ లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తీసుకుంటున్నది ఎంతో తెలుసా..? అక్షరాలా 350 కోట్లు. 400కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే సినిమాకు రాజమౌళి తీసుకుంటున్న మొత్తం 350 కోట్లే.  ఎలా అంటే రాజమౌళి ఈ సినిమా బిజినెస్ లో కూడా వాటా తీసుకుంటున్నాడు. 

 

ఇండియన్ సినిమా ప్రైడ్ మూవీ బాహుబలి తీసి వరల్డ్ వైడ్ గా 2500 కోట్లు వసూల్ చేసిన డైరెక్టర్ గా  రాజమౌళి క్రేజ్ బాలీవుడ్ లో మామూలుగా లేదు. ఎందుకుంటే. రాజమౌళి క్రేజ్ కి  బాహుబలి ఫస్ట్ పార్ట్ కే బాలీవుడ్ లో 500 కోట్ల బిజినెస్ అయ్యింది. అలా చూసుకుంటే..  మొత్తం కలిపి  ఆర్ఆర్ఆఱ్  800కోట్లు ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాల టాక్.

 

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబందించి ప్రతి డీల్ రాజమౌళి ఓకే చెబితేనే ఫైనల్ అవుతోందట. అందుకే రాజమౌళి ఈ సినిమాకు తీసుకుంటున్న 100 కోట్ల ప్యాకేజ్ కాకుండా   ఆర్ఆర్ఆఱ్  బిజినెస్ లో 20 నుంచి  25 పర్సెంట్ షేర్ కూడా తీసుకుంటున్నాడు. మరి దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తూ  టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాకు ఆ మాత్రం బిజినెస్ జరగకపోతే ఎలా అని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: