వ‌రుస ప్లాపుల త‌రువాత దాదాపు ఫిల్మ్ కెరీర్ చివ‌ర‌కు చేరుకున్న నితిన్‌కు సెకెండ్ ఇన్నింగ్ స‌క్సెస్‌ల‌తో ముందుకు దూసుకుపోతుంది. నితిన్ న‌టించిన మూవీ ఇప్పుడు మినిమం గ్యారెంటీ మూవీగా మారుతుంది. దీంతో ప్రొడ్యూజ‌ర్లకు నితిన్ ఓ వరం అయ్యాడు. అంతే కాకుండా నితిన్‌కి ఇప్పుడు అభిమానుల సంఖ్య కూడ పెరిగింది. నితిన్ అభిమానులే కాకుండా ప‌వ‌న్ అభిమానులు కూడ నితిన్ అభిమానులు కావ‌డంతో, నితిన్ మూవీకు ఇది ప్లస్‌గా మారింది. ఈ ఫిగ‌ర్ బాక్సాపీస్‌ను మేజిక్ చేస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆశీస్సులు నితిన్‌కు ఉండ‌టంతో త‌న మూవీలు వ‌రుస స‌క్సెస్‌ను చూస్తున్నాయి. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా రిలీజ్ అయిన హార్ట్ఎటాక్ మూవీ నితిన్‌ను మ‌రో అడుగు ముందుకు వేయించింది. ఇష్క్‌, గుండెజారి గ‌ల్లెత‌య్యిందే మూవీల‌తో వ‌రుస విజ‌యాల‌ను నితిన్ అందుకుంటున్నాడు. అందుకే త‌న రెమ్యున‌రేష‌న్‌ను పెంచాలని నిర్ణయించుకున్నాడు. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఎపిహెరాల్డ్‌.కామ్ మీకు అందిస్తుంది. నితిన్ న‌టించిన గ‌త చిత్రం గుండెజారి గ‌ల్లెంద‌య్యిందే మూవీకు దాదాపు అయిదు కోట్ల రూపాయ‌ల‌ను తీసుకున్నాడు. ఇప్పుడు హార్ట్ఎటాక్ మూవీకూ అదే రెమ్యున‌రేష‌న్‌ను తీసుకున్నాడు. హార్ట్ఎటాక్ మూవీ సూప‌ర్ స‌క్సెస్‌ను సాధించ‌టంతో నితిన్ త‌న రెమ్యున‌రేష‌న్‌ని ఒక్కసారిగా రెండు కోట్లరూపాయ‌లు పెంచేశాడు. ఇప్పుడు మొత్తంగా 7 కోట్ల రూపాయ‌ల‌ను నితిన్ డిమాండ్ చేస్తున్నడ‌ట‌. మొత్తానికి స‌క్సెస్ మీద స‌క్సెస్‌లు వ‌స్తుంటే ఎవ‌రైనా రేటు పెంచ‌కుండా ఉంటారా చెప్పండి అని నిర్మాత‌లనే నితిన్ ప్రశ్నిస్తున్నాడంట‌. హార్ట్ఎటాక్ మూవీ స‌క్సెస్ అయినందుకే నితిన్ రేటు పెంచాడా? లేక స‌క్సెస్‌లో ఉన్నాను క‌దా అని రేటు పెంచుకున్నాడా? ఈ టాపిక్స్‌పై మీ కామెంట్స్‌ను పోస్ట్ చేయాండి.

మరింత సమాచారం తెలుసుకోండి: