మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రానికే హిట్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. రెండో సినిమా మగధీరతో తెలుగు సినిమా రికార్డులు తిరగరాసి భారీ ఇండస్ట్రీ హిట్ సాధించాడు. రంగస్థలం వంటి రస్టిక్ క్యారెక్టర్ ను చేసి రెండో ఇండస్ట్రీ హిట్ సాధించాడు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలిసి భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమాపై అనేక వార్తలు, దర్శకుల పేర్లు వస్తున్నాయి.

 

 

ఫిలింనగర్ సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను మళ్లీరావా, జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా పూర్తిగా లవ్ స్టోరీ అని తెలుస్తోంది. గౌతమ్ చెప్పిన పాయింట్ రామ్ చరణ్ కు నచ్చిందని టాక్. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమని కూడా గౌతమ్ కు చెప్పాడని అంటున్నారు. చాలా మంది దర్శకుల పేర్లు వినవస్తున్నప్పటికీ గౌతమ్ కథకే రామ్ చరణ్ మొగ్గుచూపే అవకాశం ఉందని అంటున్నారు. పంజాబీ అమ్మాయి ప్రేమలో పడే కుర్రాడిగా రామ్ చరణ్ కనిపిస్తాడని కూడా ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

 

 

అయితే.. దీనిపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో రాజమౌళి మగధీర తర్వాత ఆరెంజ్ అనే లవ్ స్టోరీనే చేశాడు చరణ్. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడూ రాజమౌళితోనే సినిమా చేస్తున్న చరణ్ తర్వాత మళ్లీ లవ్ స్టోరీనే ఎంచుకుంటున్నాడని అంటున్నారు. గౌతమ్ తో సినిమా నిజమే అయితే.. ఈ సెంటిమెంట్ ను రామ్ చరణ్ అధిగమిస్తాడా.. లేదా అనేది చూడాల్సిందే. అసలే టాలీవుడ్ లో సెంటిమెంట్లు ఎక్కువ కదా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: