పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ నుండి ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా  మగువ మగువ అనే లిరికల్ వీడియో విడుదల కాగా ఈ సాంగ్ యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకొని యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన నాలుగు గంటల్లోనే 316k లైకులను రాబట్టుకొని టాలీవుడ్ లో అతి తక్కవ సమయం లో అత్యధిక లైకులను సొంతం చేసుకున్న మొదటి సాంగ్ గా మగువ మగువ రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకుముందు 24 గంటల్లో అల.. వైకుంఠపురములోని రాములో రాముల (315K ), సామజవరగమన (312k ) లైకులను రాబట్టుకోగా మగువ మగువ  కేవలం నాలుగు గంటల్లోనే ఆరికార్డులను బద్దలు కొట్టడం విశేషం.
 
 
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా నటిస్తుండగా యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేలో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. 
 
 
ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ ఈసినిమా తోపాటు ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా పవన్ కూడా జాయిన్ అయ్యాడు. భారీ బడ్జెట్ తో మెగా సూర్య బ్యానర్ పై  ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ విలన్ గా నటిస్తుండగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్రలో కనిపించనుంది. వచ్చే ఏడాది ఈసినిమా విడుదలకానుంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: