మంచు విష్ణు మోహన్ బాబు పెద్ద కొడుకు. ఈయన మోహన్ బాబు తనయుడుగా చిత్ర రంగంలోకి అడుగుపెట్టాడు. కానీ.. తనకంటూ నటుడిగా మంచి గుర్తింపే సొంతం చేసుకున్నాడు విష్ణు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న విష్ణుకి మధ్యలో బ్రేక్ గా, కొన్ని పరాజయాలు ఆయన కేరీయర్ ను వెనక్కి లాగుతున్నాయి. అయినా కూడా తన మార్కెట్ నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు ఈ మంచు హీరో.

 


చివరగా ఓటర్, ఆచారి అమెరికా యాత్ర లాంటి చిత్రాల్లో మంచు విష్ణు  నటించాడు. ప్రస్తుతం విష్ణు కన్నప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. అయితే.. విష్ణు ఓ ఇంటర్వ్యూలో విష్ణు తన కెరీర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. కాగా., తన కొత్త సినిమా అయినా భక్త కన్నప్ప చిత్రంపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ సినిమాను మొదటగా తనికెళ్ళ భరణి దర్శత్వంలో తెరకెక్కించాలని అనుకుని విష్ణు కథ కూడా రెడీ చేయించారట.

 


కాగా., భక్త కన్నప్ప చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాలని ఆయన కోరికట. హాలీవుడ్ రైటర్ ని కూడా ఈ సినిమా కోసం తీసుకున్నాము. తర్వాత ప్రీప్రొడక్షన్ లో బడ్జెట్ అంచనా వేస్తే 95 కోట్ల వరకు అవసరం అనిపించింది. ఈ విషయం గురించి తెలిశాక భరణి అంకుల్ నేను హ్యాండిల్ చేయలేను అన్నారు. ప్రస్తుతం బడ్జెట్ తగ్గించే పనిలో ఉన్నాం అని తెలిపాడు.

 


కొందరు టాలీవుడ్ ప్రముఖ దర్శకులని అడిగితే వారు బడ్జెట్ లో 30 శాతం రెమ్యునరేషన్ అడిగారు. అది నాకు నచ్చలేదు అని విష్ణు తెలిపాడు. వంద కోట్లతో సినిమా చేసేంత డబ్బు మీ దగ్గర లేదా అని ప్రశ్నిస్తే.. నా దగ్గర లేదని చెప్పేశాడు విష్ణు. భక్త కన్నప్ప విజయం సాధిస్తే వస్తుందన్నారు. నేను కట్టే ఐటీ రిటర్న్స్ అధికారులు చూసి షాకయ్యారు. మీ రిటర్న్స్ ఇంత తక్కువగా ఉన్నాయేంటి అని అడిగారు. నా సినిమాలు ఆడితేనే కదా నన దగ్గర డబ్బు ఉంటుంది అని విష్ణు చెప్పుకొచ్చాడు. 

 


రాజకీయంగా మంచు ఫ్యామిలీ స్టాండ్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా మొదటి ప్రాధాన్యత నా భార్య విరోనికా, ఫ్యామిలీకే. అటు చంద్రబాబుకు, ఇటు జగన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నా అంకులే. నా భార్యకు జగన్ అన్న అవుతారు. కాబట్టి జగన్ అన్నే నాకు ముఖ్యం అంటూ చెప్పుకొచ్చారు. బాలయ్యతో కూడా మంచి రిలేషన్ ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ మొత్తం వైఎస్ జగన్ కు సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: