స్టార్ హీరోల విశేషాలు.. సంగతులు తెలియాలంటే.. వాళ్ల సోషల్ మీడియాలో ఫాలో కావాల్సిందే. ముఖ్యంగా ట్విట్టర్ ను అనుసరిస్తే.. అప్ డేట్ సమాచారం దొరుకుతుంది. ఎంతటి స్టార్ హీరోలైనా.. వీళ్లను ఫాలో అయ్యే వాళ్లు తక్కువే. ఈ విషయంలో మహేశ్ సౌత్ హీరోల్లోనే నెంబర్ ఒన్ ప్లేస్ లో ఉన్నారు. ట్విట్టర్ లో సూపర్ స్టార్ ను అనుసరించే వారి సంఖ్య 90లక్షలు దాటింది. 

 

మహేశ్ మారాడు. గతంలో మాదిరి ఎప్పుడో ఒకసారి.. సినిమా రిలీజైన టైమ్ లో మాత్రమే కబుర్లు చెప్పే మహేశ్ ఈ మధ్యకాలంలో ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. ఈ క్రమంలో సూపర్ స్టార్ ను ఫాలో అయ్యేవారు కూడా పెరిగారు. ఈ సంఖ్య ఇప్పుడు 9 మిలియన్స్ కు చేరింది. బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి యంగ్ స్టార్స్ కు అభిమానులు ఎక్కువే అయినా.. ట్విట్టర్ లో మాత్రం.. నాగార్జునకే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు. 59లక్షల ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు నాగార్జున.

ట్విట్టర్ ఫాలోవర్స్ లో స్టార్ కాని హీరో రానా మూడో ప్లేస్ లో ఉండటం విశేషం. ఈ హీరో ట్విట్టర్ అకౌంట్ ను 58లక్షల మంది అనుసరిస్తున్నారు. రజనీకాంత్ కు ఉన్న క్రేజ్ ఇండియాలో మరే హీరోకూ లేదు. అదిరిపోయే క్రేజ్ ఉన్న ఈ ఆలిండియా సూపర్ స్టార్ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫాలోయర్స్ 57లక్షలు మందే ఉన్నారు. 

 

మన స్టార్స్ డైలాగ్ చెబితే.. క్లాప్స్ కొడతారు. ఫైట్ చేస్తే విజిల్ చేస్తారు. అయితే ఇదంతా వెండితెరకే పరిమితం. హీరోగా ఎంత క్రేజ్ సంపాదించినా.. సోషల్ మీడియాలో మాత్రం ఆదరణ తక్కువే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ట్విట్టర్ అకౌంట్ ను 38లక్షల మందే అనుసరిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: