సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన 'అల వైకుంఠపురం లో' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ అతని తండ్రి, దేశంలోనే అతి పెద్ద నిర్మాత అయిన అల్లు అరవింద్ గురించి భావోద్వేగంతో మాట్లాడి చాలా ఎమోషనల్ అయిన విషయం తెలిసిందే. సందర్భంగా అతను నేను నా తండ్రి స్థానానికి జీవితం లో రాలేనేమో అని అనిపిస్తుంది అని కూడా అన్నాడు. అది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ కడుపు నిండిపోయింది. అయితే ఇప్పుడు బన్నీ అతని తండ్రి కోసం ఒక చిన్న ఫేవర్ చేయనున్నాడు.

 

IHG

 

అల్లు అరవింద్ మరియు మరికొందరు పార్ట్నర్స్ కలిసి తెలుగులో ప్రవేశపెట్టిన డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ 'ఆహా' ప్రస్తుతం తొలి దశలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో అతి కొద్ది ప్రీమియర్ కంటెంట్ మాత్రమే ఉండగా అదీ పెద్దగా జనాదరణను చూరగొనలేకపోయింది. ఇప్పటికే అప్లికేషన్ కు విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ఇప్పుడు ప్రజలకు దీని గురించి మరింత తెలిసేలా ప్రస్తుతం అల్లు అరవింద్.... బన్నీతో రెండు ప్రమోషనల్ యాడ్స్ షూట్ చేయించనున్నాడు.

 

IHG

 

బన్నీకి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ రెండు ప్రమోషనల్ అడ్వర్టైజ్ మెంట్స్ ను షూట్ చేయనున్నాడు. మరొక రెండు రోజుల్లో వీరిద్దరూ కలిసి అల్లు అరవింద్ ఆహా యాడ్ కోసం మంచి కంటెంట్ తో అడ్వర్టైజ్ మెంట్స్ షూట్ చేసి జనాలలో దాని పాపులారిటీని పెంచబోతున్నారు. మరి కొడుకు ఇన్వాల్వ్మెంట్ తో అయినా 'ఆహా' తలరాత మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: