టాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న నేచురల్ స్టార్ నాని గత ఏడాది జెర్సీ, గ్యాంగ్ లీడర్ తో మంచి విజయాలు అందుకున్నాడు.  ఓ వైపు నటుడిగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కొనసాగుతున్నారు.  ఈ మద్య నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హట్’ మూవీ మంచి సక్సెస్ సాధించింది.  ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్న నాని ‘వి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.  ప్రస్తుతం నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న తాజా మూవీ ‘ట‌క్ జ‌గ‌దీష్‌’. ప్ర‌స్తుతం రాజ‌మండ్రిలో షూటింగ్ జ‌రుగుతుంది. 

 

గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు.  ల‌వ్‌, ఎమోష‌న్స్ ప్ర‌ధానంగా తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ ఈ సినిమాను కూడా త‌న స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌.  భలే భలే మగాడివోయ్ మూవీ తర్వాత నాని లవ్, ఎమోషనల్, ఫ్యామిలీ తరహా సినిమాలతో బాగా ఆకట్టుకుంటున్నాడు.  గత ఏడాది జర్సీ సినిమాతో ఫ్యామిలీ ఎమోషన్ తో అందరిచేత కంట తడి పెట్టించాడు.  మజ్ను, నిన్నుకోరి, నేను లోకల్ సినిమాలతో లవర్ బాయ్ గా ఆకట్టుకున్నాడు. 

 

గ్యాంగ్ లీడర్ తో ఫ్యామిలీ ఆడియాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. తాజాగా  ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ మూవీలో ఇద్దరు అమ్మాయిలతో రోమాన్స్, వొత్తిడి లాంటి క్యారెక్టర్ లో నటించబోతున్నాడట. గతంలో జెంటిల్ మాన్ సినిమాలో కూడా ఈ తరహా పాత్రలో నటించాడు.  ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.  జంటిల్ మెన్ లో నాని ఇద్దరు భామల మద్య నలిగిపోయే పాత్ర.. ఈ మూవీలో నాని నటనకు మంచి పేరు వచ్చింది.  ఆ తర్వాత మజ్ను లో కూడా ఇదే తరహా పాత్రలో నటించాడు.  ఓ ప్రేమికుడిగా ఇద్దరు భామల మద్య నలిగిపోయే పాత్రలో ఇప్పడు టక్ జగదీష్ లో కనిపించబోతున్నాడ. 

మరింత సమాచారం తెలుసుకోండి: