టాలీవుడ్ లో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా విక్రమ్ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు అక్కినేని నాగార్జున. లవర్ బాయ్, మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నాగార్జున.  మన్మథుడితో నిజంగా మన్మథుడు అనిపించుకున్నాడు.  గత ఏడాది ఈ మూవీ సీక్వెల్ మన్మథుడు 2 తో వచ్చి దెబ్బతిన్నాడు.  కింగ్ దగ్గరనుండి హిట్ వచ్చి చాలా కాలమైంది. అయితే నాగార్జున ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండడం విశేషం. బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రలో కీలక పాత్రలో నటించాడు నాగార్జున. ఆ సినిమా త్వరలో విడుదలవుతుంది.

 

భారీ బడ్జెట్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. . మోహన్ లాల్ హీరోగా తెరకెక్కబోయే మూవీలో తాను ఒక చిన్న పాత్రలో నటిస్తున్నట్లు షూటింగ్ లో కూడా పాల్గొంటున్నట్లు అప్పట్లో స్వయంగా తెలిపాడు నాగ్.  అంతే కాదు ఈ మూవీ తన ప్రాణ స్నేహితుడు దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించే సినిమా కావడంతో కాదనలేకపోయానని చెప్పాడు.   అప్పట్లో నిర్ణయం అనే సినిమాను చేసారు. అఖిల్ హీరోగా తెరకెక్కిన హలో మూవీలో ప్రియదర్శన్ కూతురు కళ్యాణిని హీరోయిన్ గా అరంగేట్రం చేయించాడు నాగ్.

 

ఆ చొరవతోనే ప్రియదర్శన్ అడిగిన వెంటనే మోహన్ లాల్ మూవీ చిన్న పాత్ర చేయడానికి ఒప్పుకున్నాడు.  తాజాగా మోహన్ లాల్ నటించిన ‘మరక్కాన్’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబులు విడుదల చేసారు. అయితే ఇందులో నాగార్జున నటించిన దాఖలాలు లేవు.  కనిపించలేదు షూటింగ్ లో కూడా పాల్గొన్నాక ఏమైంది? ఎందుకని ఈ సినిమా నుండి నాగార్జున తప్పుుకున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ఆయన తెలుగు లో కొన్ని సినిమాలపై ఫోకస్ చేస్తున్నారు. ఈ కారణంతోనే ఆ మూవీలో తప్పుకున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: